Share News

Tirupati News: అన్యమత చిహ్నాలతో తిరుమలకు వాహనం..

ABN , Publish Date - Nov 21 , 2025 | 01:49 PM

తమిళనాడు రాష్ట్రాని చెందిన ఓ వాహనంపై అన్యమత చిహ్నాలు ఉండటాన్ని గుర్తించారు. అయితే.. ఈ వాహనం అలిపిరి టోల్‏గేట్ దాటి తిరుమల కొండపైకి చేరుకోవడం గమనార్హం. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఒకరిని విధుల నుంచి తొలగించింది.

Tirupati News: అన్యమత చిహ్నాలతో తిరుమలకు వాహనం..

- అలిపిరి భద్రతా ఉద్యోగిపై చర్యలు

తిరుమల: అన్యమత చిహ్నాలతో ఉన్న వాహనాన్ని గుర్తించి అడ్డుకోవడంలో నిర్లక్ష్యం వహించారంటూ అలిపిరి టోల్‌ సిబ్బంది ఒకరిని విధుల నుంచి టీటీడీ(TTD) తొలగించింది. టీఎన్‌ 31 ఏఈ 4073 నెంబరు గల టెంపో ట్రావెలర్‌ గురువారం అలిపిరి(Alipiri) దాటి నిరాటంకంగా తిరుమలకు చేరుకుంది. ఫైర్‌ స్టేషన్‌కు వెనుక పార్కింగ్‌లో ఉన్న తమిళనాడు(Tamil Nadu)కు చెందిన ఈ వాహనంలో అన్యమత చిహ్నం, స్టిక్కర్‌తో ఉండడాన్ని కొందరు గుర్తించి విజిలెన్స్‌, మీడియాకు సమాచారమిచ్చారు.


nani6.2.jpg

విజిలెన్స్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని అన్యమత చిహ్నాలను తొలగించారు. కాగా అలిపిరి(Alipiri) తనిఖీ కేంద్రంలోని తొమ్మిదోలైన్‌ నుంచి వాహనం వచ్చిందని గుర్తించి, అక్కడ విధుల్లో ఉన్న వాసు అనే భద్రతా ఉద్యోగిని తొలగించి, శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని టీటీడీ తెలిపింది. వాహన డ్రైవర్‌ గోబి, యజమానిపై కేసు నమోదు చేశారు.


zzzzzzzzzzzzzzzzzzzzzzz.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

రూపాయి మారకానికి లక్ష్యమేమీ పెట్టుకోలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 21 , 2025 | 01:49 PM