Budda Venkanna Warning: చంద్రబాబు, లోకేశ్‌లపై నోరు జారితే ఖబడ్దార్
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:45 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై వైసీపీ సైకోలు అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగినరీతిలో..

వైసీపీ సైకోలకు తగిన రీతిలో బుద్ధి చెబుతాం: బుద్దా వెంకన్న
విజయవాడ(వన్‌టౌన్), జూలై 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై వైసీపీ సైకోలు అనవసరంగా నోరు పారేసుకుంటే వారికి తగినరీతిలో బుద్ధి చెబుతామని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న హెచ్చరించారు. విజయవాడలోని తన కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేశ్‌లపై జగన్‌రెడ్డి సైకోలు పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జోగి రమేష్ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు కృషి వల్ల ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం చాలామంది ముందుకు వస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ సైకోలందరూ కలిసి అల్లర్లకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. పేర్ని నాని విశ్వాసం లేని కుక్కని, రేషన్ బియ్యం బొక్కేసింది, స్థలాలు కబ్జా చేసింది ఆయన కాదా అని ప్రశ్నించారు. దసరా ఉత్సవాల సమయంలో పులి వేషగాళ్ల తరహాలో వైసీపీ సైకోలు వ్యవహరిస్తున్నారని, వారికి ఏమాత్రం సిగ్గు, శరం లేవని మండిపడ్డారు. తమ నాయకుడు అరగంట టైమ్ ఇస్తే వారి సంగతి ఏమిటో చూస్తానని చెప్పారు. ‘వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వారి అరాచకాలను అడ్డుకుని ధైర్యంగా నిలబడ్డ వ్యక్తులం. మా నాయకుడి కోసం ప్రాణాలైనా ఇస్తాం. ఏరా పేర్ని నానీ... లోకేశ్ బాబును ఏరా అంటావా’ అని మండిపడ్డారు. మరోసారి అవమానకరంగా మాట్లాడితే సహించేది లేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్