Share News

Lokesh Kasibugga Stampede: కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్

ABN , Publish Date - Nov 01 , 2025 | 02:37 PM

కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని మంత్రి లోకేష్ పరిశీలించనున్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు.

Lokesh Kasibugga Stampede: కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్
Lokesh Kasibugga Stampede

శ్రీకాకుళం, నవంబర్ 1: కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంలో తొక్కిసలాట (Kasibugga Stampede) జరిగింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరారు. హైదరాబాద్ నుంచి విశాఖకు బయలుదేరిన మంత్రి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గకు చేరుకుంటారు. ఆపై తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.


ఈ ఘటనలో మృతుల కుటుంబసభ్యులను, గాయపడిన వారిని పరామర్శించనున్నారు. అలాగే బాధితులను ఆదుకునేందుకు చేసే సహాయం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమీక్ష జరుపనున్నారు.


కాశీబుగ్గకు కేంద్రమంత్రి

Rammohan naidu.jpg

మరోవైపు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఢిల్లీ నుంచి కాశీబుగ్గకు బయలుదేరారు. ఇందుకు భోపాల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఇవి కూడా చదవండి...

పదేపదే బాంబు బెదిరింపులు.. ఆందోళనలో ప్రయాణికులు

షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 01 , 2025 | 03:48 PM