Share News

Srikakulam stampede: ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

ABN , Publish Date - Nov 01 , 2025 | 02:37 PM

తొక్కిసలాటలో పలువురు గాయపడటం, వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

Srikakulam stampede: ప్రధాని దిగ్భ్రాంతి.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
PM Modi

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga) లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం నాడు తొక్కిసలాట జరిగి 10 మంది మృతిచెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 'ఈ ఘటన బాధాకరం. కుటుంబసభ్యులను కోల్పోయిన వారి గురించే నా ఆలోచనంతా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. మృతులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని పీఎంఓ కార్యాలయం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సైతం ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.


కాగా, తొక్కిసలాటలో పలువురు గాయపడటం, వీరిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


సీఎం సంతాపం

తొక్కిసలాట ఘటనలో పలువురు మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాదకర ఘటన తనను కలిచివేసిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. తక్షణ సహాయక చర్యలకు అధికారులను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

ఆలయంలో అత్యంత విషాదం.. స్పాట్ లోనే పది మంది మృతి.!

కాశీబుగ్గ ఘటనపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 01 , 2025 | 03:31 PM