TDP: టీడీపీ నేతల ఫైర్.. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యం వల్లే పదవి ఊడింది..
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:50 PM
మున్సిపల్ ఛైర్మన్‌గా ఉండి కూడా తలారి రాజ్‌కుమార్ ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్‌వలీ స్పష్టం చేశారు.
- మున్సిపల్ మాజీ చైర్మన్‌పై టీడీపీ నాయకుల ఫైర్
కళ్యాణదుర్గం(అనంతపురం): మున్సిపల్ ఛైర్మన్‌గా ఉండి కూడా తలారి రాజ్‌కుమార్(Talari Rajkumar) ప్రజాసమస్యలను నిర్లక్ష్యం చేశారని, దాని ఫలితంగానే పదవి పోయిందని, ఇందులో రాజకీయాలు ఏమీ లేవని.. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సర్మస్‌వలీ స్పష్టం చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ‘14 నెలలుగా ప్రజాసమస్యలను గాలికి వదిలేశారు. ఏ రోజూ మున్సిపల్ కార్యాలయానికి రాలేదు.
పలుమార్లు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి రిజిస్టర్ పోస్టులు పంపించినా వాటికి స్పందించకుండా మొద్దు నిద్రలో ఉండిపోయారు. పట్టణంలో ప్రజలు తాగునీరు, డ్రైనేజీ తదితర అనేక సమస్యతో ఇబ్బందులు పడుతున్నా.. ఏ మాత్రం పట్టించుకోలేదు. సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ ఆహ్వానించినా ఒక్కసారి కూడా కౌన్సిల్ సమావేశానికి రాకుండా.. అభివృద్ధిని అడ్డుకున్నారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించే ఎమ్మెల్యే దొరకడం అదృష్టం. కాని మీరు ఆ అభివృద్ధిని అడ్డుకునేలా ప్రవర్తించారు. మీరు చేసిన నిర్లక్ష్యం.. చేసిన తప్పిదాల వల్లే మీ పదవి పోయిందే తప్పా..ఇందులో రాజకీయాలు ఏమీ లేవు.’ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి
Read Latest Telangana News and National News