Share News

Weekly train: మచిలీపట్నం- కొల్లం మధ్య ప్రత్యేక వీక్లీ రైలు

ABN , Publish Date - Nov 08 , 2025 | 07:28 AM

మచిలీపట్నం - కొల్లం మధ్య కడప మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్‌ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.జనార్దన్‌ తెలిపారు.

Weekly train: మచిలీపట్నం- కొల్లం మధ్య ప్రత్యేక వీక్లీ రైలు

కడప: మచిలీపట్నం - కొల్లం మధ్య కడప(Kadapa) మీదుగా ప్రత్యేక వీక్లీ రైలు (నెంబర్‌ 07103/07104) నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.జనార్దన్‌(Kadapa Railway Senior Commercial Inspector A. Janardhan) తెలిపారు. మచిలీపట్నంలో శుక్రవారం (డిసెంబరు 5, 12, 19 తేదీలు 2026 జనవరి 9, 16 తేదీలలో) ఉదయం 11గంటలకు రైలు బయలు దేరుతుందన్నారు. అదేరోజు రాత్రి ప్రొద్దుటూరుకు 11:03 గంటలకు, ఎర్రగుంట్లకు 11:28, కడపకు అర్ధరాత్రి 00:03, రాజంపేటకు 00:58, కోడూరుకు 02:03, రేణిగుంట(Renigunta)కు 3:25 గంటలకు చేరుకుని..


city1.2.jpg

కాట్పాడి జాలార్పేట మీదుగా అదేరోజు రాత్రి 10గంటలకు కొల్లం చేరుకుంటుం దన్నారు. తిరుగు ప్రయాణంలో కొల్లం నుంచి ఆదివారం (డిసెంబరు 7, 14, 21 తేదీలు, 2026 జనవరి 11, 18 తేదీలలో) మధ్యాహ్నం 2:30గం టలకు బయలుదేరుతుందన్నారు. రేణిగుంటకు అదేరోజు రాత్రి 9:50కి కోడూరుకు 10:36, రాజంపేటకు 11:08, కడపకు 11:53,


city1.4.jpg

ఎర్రగుంట్లకు అర్ధరాత్రి 12:28, ప్రొద్దుటూరుకు 12:53గంటలకు చేరుకుంటుందని చెప్పారు. నంద్యాల, విజయవాడ మీదుగా మచిలీపట్నానికి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ(Andhra Pradesh, Kerala) మధ్య ప్రయాణికుల సౌకర్యార్థంగా ప్రత్యేక రైలును వేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల!

కిసాన్‌ డ్రోన్‌.. సాగు ఖర్చు డౌన్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 08 , 2025 | 07:28 AM