Share News

Trains: గుంతకల్లు మీదుగా పలు రైళ్ల దారిమళ్లింపు..

ABN , Publish Date - Feb 07 , 2025 | 12:28 PM

ఖమ్మం రైల్వే స్టేషన్‌(Khammam Railway Station)లో జరుగుతున్న నాన్‌ ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా నాలుగు రైళ్లను గుంతకల్లు(Guntakal) మీదుగా మళ్లించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు.

Trains: గుంతకల్లు మీదుగా పలు రైళ్ల దారిమళ్లింపు..

గుంతకల్లు(అనంతపురం): ఖమ్మం రైల్వే స్టేషన్‌(Khammam Railway Station)లో జరుగుతున్న నాన్‌ ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా నాలుగు రైళ్లను గుంతకల్లు(Guntakal) మీదుగా మళ్లించనున్నట్లు రైల్వే శాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. హజ్రత్‌ నిజాముద్దీన్‌-కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 12642) రైలును ఈ నెల 10, 15, 17 తేదీల్లో విజయవాడ-గూడూరు సెక్షన్‌ ద్వారా కాకుండా బాలార్షా, ఖాజీపేట్‌, కాచిగూడ, డోన్‌, గుంతకల్లు, రేణిగుంట, చెన్నై(Balarsha, Ghazipet, Kacheguda, Don, Guntakal, Renigunta, Chennai) మీదుగా మళ్లిస్తామని తెలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ డిమాండ్.. పంట రుణాలు మాఫీ చేయాలి


హజ్రత్‌ నిజాముద్దీన్‌-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 12644) రైలును ఈనెల 14న, హజ్రత్‌ నిజాముద్దీన్‌-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 12646) రైలును ఈనెల 11, 18 తేదీల్లోనూ, ఇండోర్‌-త్రివేండ్రం ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 22645) రైలును ఈనెల 10, 17 తేదీల్లోనూ బాలార్షా, ఖాజీపేట్‌, కాచిగూడ, డోన్‌, గుంతకల్లు, రేణిగుంట, చెన్నై మార్గంలో మళ్లిస్తామని తెలిపారు. గుంతకల్లు రైల్వే డివిజన్‌లో జరుగుతున్న నాన్‌ ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా షోలాపూర్‌-తిరుపతి (వయా గుంతకల్లు) వెళ్లే ప్రత్యేక రైలు (నంబర్‌ 01437) ను ఈ గురువారం (6న) విజయపుర-గదగ్‌-హోస్పేట-బళ్లారి-గుంతకల్లు మీదుగా మళ్లించారు.


pandu1.2.jpg

ఔరంగాబాద్‌-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ (నంబర్‌ 17621)ను 7వ తేదీ తాండూరు-ఆదోని మీదుగా కాకుండా వికారాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ, డోన్‌, గుంతకల్లు(Secunderabad, Kacheguda, Doon, Guntakal) మీదుగా మళ్లిస్తున్నామని తెలియజేశారు. గుంతకల్లు మీదుగా వెళ్లే కన్యాకుమారి-పూనే ఎక్స్‌ప్రె్‌సను (నంబర్‌ 16382) ఈ నెల 6, 7, 8 తేదీలలో గంటన్నర ఆలస్యంగా నడుపుతున్నామని తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 12:28 PM