హాజరు కోసమే అసెంబ్లీకి జగన్: పురందేశ్వరి
ABN , Publish Date - Feb 26 , 2025 | 04:19 AM
హాజరు కోసమే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కాదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

రాజమహేంద్రవరం అర్బన్, ఒంగోలు కలెక్టరేట్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ‘హాజరు కోసమే జగన్మోహన్‌రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి కాదు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో వ్యాఖ్యానించారు. వరుసగా ఆరు నెలలపాటు అసెంబ్లీకి వెళ్లకపోతే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉందని, ఆ భయంతోనే జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారన్నారు. అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీలో బూతుల పురాణం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీని కౌరవ సభలాగా నడిపించారని పురందేశ్వరి ఒంగోలులో ధ్వజమెత్తారు.