Share News

Janasena: జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు..

ABN , Publish Date - Feb 25 , 2025 | 07:19 PM

Janasena: ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాక్‌ల మీద షాకులు తగులుతోన్నాయి. ఇప్పటికే ఆ పార్టీలోని అగ్రనేతలంతా ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్లిపోయారు. తాజాగా గతంలో వైసీపీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు సైతం ఆ పార్టీని వీడుతోన్నారు.

Janasena: జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు..

అమరావతి, ఫిబ్రవరి 25: ఒంగోలులో వైసీపీ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు చేరనున్నారు. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతోనే.. ఒంగోలులో ఆ పార్టీ నిర్వీర్యమైందనే వాదన వినిపిస్తోంది. అనంతరం ఆయన వైసీపీ ఖాళీ చేయించే పనిలో ఉన్నారని సమాచారం.

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్‌లో 41 మంది వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం 19 మంది కార్పొరేటర్లు, మేయర్ కలిసి.. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో మిగిలిన కార్పొరేటర్లు.. బాలినేని శ్రీనివాసరెడ్డి టచ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వారంత ఈ రోజు జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనలో చేరుతోన్న ఈ కార్పొరేటర్లకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.


మరోవైపు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వరుస చర్చలు జరుపుతోన్నారు. ఆ క్రమంలో పలువురు జనసేనలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. అసంతృప్తి నేతలను హైదరాబాద్ పిలుపించుకొని వారితో చర్చించి.. జనసేనలో చేరేలా వారిని ఒప్పిస్తున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేయాలనే ఓ విధమైన లక్ష్యంలో బాలినేని ముందుకు వెళ్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : అసోం బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Also Read: డీఎస్సీ‌‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు

Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు

For AndhraPradesh New And Telugu News

Updated Date - Feb 25 , 2025 | 08:12 PM