Nimmala Ramanaidu: ప్రజల్ని మోసం చేయడం.. జగన్‌కు లెక్కేకాదు..
ABN , Publish Date - Nov 07 , 2025 | 01:43 PM
వెలిగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రాజెక్టును ప్రారంభించారని మంత్రి రామానాయుడు తెలిపారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్‌కు ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చెయ్యడం లెక్కకాదని ఆరోపించారు.
ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2026 లోపు పూర్తి చేస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. 30 ఏళ్ళుగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగటంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రతి 15 రోజులకోసారి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణంపై రివ్యూ చేస్తున్నారని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పగలు, రాత్రి పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
వెలిగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రాజెక్టును ప్రారంభించారని మంత్రి రామానాయుడు ఆరోపించారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్‌కు ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చెయ్యడం లెక్కకాదని ఆరోపించారు. జగన్ చర్యలు హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. జగన్ మానసిక పరిస్థితి విచిత్రంగా ఉందని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో నిర్వాసితులకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హంద్రీనివా రాయలసీమకి జీవనాడి అని స్పష్టం చేశారు. 2025లోనే హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి చేశామని మంత్రి రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
Jubilee Hills by-election: మద్యం ప్రియులకు షాక్.. నాలుగు రోజులు వైన్స్ బంద్
TPCC chief Mahesh Kumar Goud: మరో డిప్యూటీ సీఎం