Nimmala Rama Naidu: యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాల్సిందే.. మంత్రి ఆదేశాలు
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:56 PM
వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో ఆలస్యంపై ఆధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు వార్నింగ్ ఇచ్చారు. పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రకాశం, నవంబర్ 12: వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఈరోజ (బుధవారం) పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి ప్రాజెక్టును మంత్రి పరిశీలించారు. మొంథా తుఫాను కారణంగా దెబ్బతిన్న ఫీడర్ కెనాల్ గండ్లు, జంట సొరంగాల్లో డీవాటరింగ్ పనులను ఇరిగేషన్ నిపుణుల బృందంతో పరిశీలించారు. ఇటీవల ఫీడర్ కెనాల్ గండి పూడిక పనులు, టన్నెల్స్‌లో డీవాటరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన టన్నెల్ డివాటరింగ్ పనులు పూర్తి చేయమని ఆదేశించినా పూర్తి కాకపోవడం పై అధికారులు, ఏజెన్సీపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి చేయాలనే లక్ష్యం ప్రభుత్వానికి ఉంటే సరిపోదని.. ఏజెన్సీలకు, అధికారులకు కూడా ఉండాలన్నారు. 2026 కల్లా వెలిగొండ పూర్తి చెయ్యాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయడంపై నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లక్ష్యం మేరకు వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా చంద్రబాబు ఆదేశాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తానని మంత్రి చెప్పారు. వెంటనే టన్నెల్స్‌లో లైనింగ్, బెంచింగ్ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులు, ఏజెన్సీకి మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం
పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
Read Latest AP News And Telugu News