Share News

Prakasham: ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి తరలింపు.. మరికొద్దిసేపట్లో..

ABN , Publish Date - Jan 28 , 2025 | 09:33 AM

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితుడిని ఉన్న కామేపల్లి తులసిబాబును ఒంగోలు పోలీసులు ఇవాళ (మంగళవారం) రెండో రోజు విచారణ చేయనున్నారు.

Prakasham: ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడి తరలింపు.. మరికొద్దిసేపట్లో..

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తు వేగవంతం అయ్యింది. ఈ కేసులో నిందితుడిని ఉన్న కామేపల్లి తులసిబాబును ఒంగోలు పోలీసులు ఇవాళ (మంగళవారం) రెండో రోజు విచారణ చేయనున్నారు. ఈ మేరకు నిందితుడిని ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. మరికొద్దిసేపట్లో ఎస్పీ దామోదర్ విచారణ ప్రారంభించనున్నారు. కాగా, తులసిబాబును మూడ్రోజులపాటు పోలీసు కస్టడీకి గుంటూరు జిల్లా కోర్టు అనుమతిచ్చింది. దీంతో సోమవారం ఉదయం జైల్లో ఉన్న తులసి బాబును ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు


వైద్య పరీక్షల అనంతరం ఒంగోలు ఎస్పీ దామోదర్ నిన్న రాత్రి 8 గంటల నుంచి 9:30 గంటల వరకూ అతన్ని విచారించారు. రఘురామపై కస్టోడియల్ టార్చర్‌ గురించి పలు ప్రశ్నలు సంధించారు. అలాగే మాజీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌తో తులసి బాబుకు ఉన్న సంబంధాలపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇవాళ, రేపు కూడా నిందితుడిని విచారించి పూర్తి వివరాలు రాబట్టనున్నారు. కాగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసి బాబును ఈనెల 8న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్టీఆర్‌ మోడల్‌ స్కూల్‌ను సందర్శించిన భువనేశ్వరి

బాబు కష్టాన్ని దావోస్‌లో ప్రత్యక్షంగా చూశా

Updated Date - Jan 28 , 2025 | 09:36 AM