Share News

Paritala Sunitha: మా ప్రాణం మీరే.. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తాం..

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:33 AM

‘మా ప్రాణం మీరే.. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారు. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తామ’ని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని కక్కలపల్లి క్రాస్‌లో గల ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం టీడీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది.

Paritala Sunitha: మా ప్రాణం మీరే.. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తాం..

- కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే సునీత

- అట్టహాసంగా నియోజకవర్గ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం

అనంతపురం: ‘మా ప్రాణం మీరే.. మీరే మమ్మల్ని ముందుండి నడిపించారు. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పనిచేస్తామ’ని టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే పరిటాల సునీత(MLA Paritala Sunitha) అన్నారు. మండలంలోని కక్కలపల్లి క్రాస్‌లో గల ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో గురువారం టీడీపీ నియోజకవర్గ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా సాగింది. కార్యక్రమానికి ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు అంజినప్ప హాజరయ్యారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు.


pandu3.2.jpg

అనంతరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన 1350మంది బూత్‌, గ్రామ, యూనిట్‌, క్లస్టర్‌, మండల కమిటీల సభ్యులతో ఉమ్మడిగా ప్రమాణ స్వీకారం చేయించారు. శాలువాలు, పూలతో సన్మానం చేశారు. ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన నాయకులకు తగిన గుర్తింపు నిచ్చే బాధ్యత తమదన్నారు.


ఇప్పటికే చాలామందికి పదవులు దక్కాయన్నారు. వారంతా బాధ్యతగా పనిచేయాలన్నారు. ఇంకా కొన్ని పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటిని త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు. గత ఐదేళ్లలో నియోజవకర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయని ప్రకా్‌షరెడ్డి ఇష్టం వచ్చినట్లు.. తమపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత నాయకుడిపై ఉందన్నారు. ఒక మహిళ చేతిలో మూడుసార్లు ఓడిపోయిన అసమర్థుడు ప్రకాష్‌ రెడ్డి అన్నారు.


pandu3.3.jpg

ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చి.. అభివృద్ధి గురించే పట్టించుకోకపోవడంతే ప్రజలు దారుణంగా ఓడించారన్నారు. కూటమి చేస్తున్న అభివృద్ధిని చూసి నియోజకవర్గంలో తనకు మనుగడ ఉండదన్న ఉద్దేశంతోనే ప్రకా్‌షరెడ్డి.. పరిటాల కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పరిటాల రవీంద్ర పేరును తగ్గించే పనులు తమ కుటుంబం ఎప్పుడూ చేయదన్నారు. అలా చేస్తే.. కాలర్‌ పట్టుకుని నిలదీయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

భరత్‌రామ్‌ నుంచి ప్రాణహాని ఉంది

Read Latest Telangana News and National News

Updated Date - Nov 14 , 2025 | 11:33 AM