Kakani Govardhan Reddy : కాకాణికి దెబ్బ మీద దెబ్బ
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:02 PM
Kakani Govardhan Reddy : అసెంబ్లీ ఎన్నికల అనంతరం జగన్ పార్టీని పలువురు నేతలు ఒక్కొక్కరుగా వీడుతోన్నారు. మరికొందరు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆ క్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో.. పోలీసులు అతడి కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో కాకాణికి మరో గట్టి దెబ్బ తగిలింది.

నెల్లూరు, ఏప్రిల్ 16: తాను ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచినట్లుయిందీ వైసీపీ పరిస్థితి. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం వై నాట్ 175 అంటూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నినాదంగా చేసుకున్నారు. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూడడంతో పార్టీకి పలువురు కీలక నేతలు తమ పదవులకే కాదు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేసేశారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఇంకా ఏడాది కూడా కాకుండానే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. సదరు నియోజకవర్గంలో మొత్తానికి మొత్తంగా ఖాళీ అవుతోంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన కాకాణి గోవర్ధన్ రెడ్డి.. దగ్గర దగ్గర నెలరోజులుగా పరారీలో ఉన్నారు. అతడి కోసం జిల్లా పోలీసులు డేగ కళ్లలో గాలిస్తున్నారు. ఆ క్రమంలో హైదరాబాద్,బెంగళురు, చెన్నై తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి కాకాణి కోసం జల్లెడ పడుతున్నారు. అందులోభాగంగా అతడి బంధువులు, స్నేహితుల నివాసాలపై నిఘాను సైతం పెంచారు.
ఇక అతడు దేశం విడిచి వెళ్లకొండ లూక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.దీంతో కుటుంబ సభ్యులతో ఫోనులో కూడా అందుబాటులో లేకుండా కాకాణి తప్పించుకొని తిరుగుతూన్నార. ఈ నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రి కాకాణిపై వైసీపీ లీడర్ నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరిలో నమ్మకం సన్నగల్లితొంది. దాంతో ఆ పార్టీకి చెందిన వారంతా వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. టీడీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఆ క్రమంలో వైసీపీ సీనియర్ నేత అక్కెం సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 40 కుటుంబాల వారు.. టీడీపీలో బుధవారం చేరారు. వారిలో ముఖ్య నేతలు.. పెదమల్లు శ్రీనివాసులు రెడ్డి,శేషారెడ్డి,రమణారెడ్డి, వెంకటేశ్వర్లు రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వారిందరికి స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. పార్టీ కండువాలు కప్పి సాధరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. దీంతో కాకాణికి దెబ్బ మీద దెబ్బ తగులుతోందనే ఓ చర్చ అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో సాగుతోంది. ఎందుకంటే.. ఇప్పటికే ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలగా ఏర్పాడి.. కాకాణిని గాలిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని కేడరంతా గంపగుత్తగా టీడీపీలో చేరిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కాకాణి వరుసగా షాక్ మీద షాక్‌లు తుగులుతోందనే ఓ చర్చ సర్వేపల్లి నియోజకవర్గంలో వైరల్ అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు..
Mark Shankar: మార్క్ శంకర్‌పై అసభ్యకర పోస్టులు.. ఒకరు అరెస్ట్