Share News

Home Minister Anitha: ఆ అధికారులపై హోంమంత్రి అనిత సీరియస్. అసలు కారణమిదే..

ABN , Publish Date - Jan 27 , 2025 | 09:10 PM

Home Minister Anitha: నైల్లూరు జిల్లా జైలు అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు.

Home Minister Anitha: ఆ అధికారులపై  హోంమంత్రి అనిత సీరియస్. అసలు కారణమిదే..
Home Minister Anitha

అమరావతి: నెల్లూరు జిల్లా జైలు సూపరింటెండెంట్ శ్రీ‌రామ్ రాజారావుకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాజారావు అవినీతి, అక్రమాల గురించి తెలుసుకుని ఉన్నత స్థాయి అధికారులు షాకింగ్‌కు గురవుతున్నారు. రిమాండ్ ఖైదీల తాలుకు బంధువుల నుంచి న‌గ‌దు, మ‌ద్యం డిమాండ్‌ చేసినట్లు ఆయనపై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం మరువక ముందే రాజారావు మ‌రో అవినీతి బాగోతం బయటకు వచ్చింది.


గ‌తేడాది గుడివాడ తెలుగుదేశం కార్యాల‌యం దాడి కేసులో మాజీ మంత్రి, వైసీపీ అగ్రనేత కొడాలి నాని అనుచ‌రుడు కాశిని నెల్లూరు జిల్లా జైలుకు హైకోర్టు రిమాండ్ ఖైదీగా త‌ర‌లించింది. కాగా రిమాండ్ ఖైదీగా వ‌చ్చిన కాశీని మంచిగా చూసుకోడానికి, అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించడానికి ఉద‌య్ అనే వ్యక్తి నుంచి రూ. 20 వేలను రాజారావు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నగదు ట్రాన్స్‌ఫర్ చేసినట్లుగా ఆధారాలు కూడా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అయితే ఈ విషయం హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి వచ్చింది. ఈ విషయంపై హోంమంత్రి అనిత చాలా సీరియస్‌గా ఉన్నారు.


ఈ ఆడియోలో ఆరోపణలు నిజమా ? కాదా ? సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్‌ను ఆదేశించారు. మాజీ ఖైదీ బంధువు, జైలు అధికారి మధ్య సంభాషణగా వస్తున్న కథనాలపై నిగ్గు తేల్చాలని మంత్రి ఆదేశించారు. మిలాఖత్‌ల కోసం ఖైదీల బంధువుల నుంచి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇలాంటి చట్ట విరుద్ధమైన అవినీతి, అక్రమాలను కూటమి ప్రభుత్వం సహించబోదని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు

Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 27 , 2025 | 09:30 PM