YS Jagan: జగన్ నెల్లూరు పర్యటనకి పోలీసుల ఆంక్షలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 07:51 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఈ నెల 31వ తేదీన పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనపై నెల్లూరు ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ మాట్లాడారు.

నెల్లూరు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నెల్లూరు జిల్లాలో (Nellore District) ఈ నెల(జులై 31 గురువారం) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా జగన్ పర్యటనపై నెల్లూరు ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ (SP Damodar) ఇవాళ(మంగళవారం జులై 29) మాట్లాడారు. జగన్ పర్యటన కోసం జన సమీకరణ చేయలేదని వైసీపీ నేతలు చెప్పారని.. హెలిప్యాడ్ వద్ద పది మందికే అనుమతి ఇచ్ఛామని.. జైలు వద్ద ముగ్గురికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. జైలు వద్ద పబ్లిక్‌కి అనుమతి లేదని.. నిబంధనలు బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్.
జగన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామని.. రోడ్ షోలకు అనుమతి లేదని.. లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు 100 మందికి మాత్రమే అనుమతి ఉందని క్లారిటీ ఇచ్చారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదని.. ఫ్లకార్డ్స్, బ్యానర్స్ ప్రదర్శిస్తే కేసులు తప్పవని.. 30 యాక్ట్ అమల్లో ఉందని హెచ్చరించారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఆంక్షలు విధిస్తామని తెలిపారు. లైవ్ డ్రోన్స్ ఏర్పాటు చేస్తున్నామని.. ప్రతి యాక్టివిటీ కంట్రోల్ రూమ్‌లో రికార్డు చేస్తామని వెల్లడించారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి అందుకు తగ్గట్లుగానే జగన్‌కి బందోబస్త్ ఉంటుందని ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏనుగుల గుంపు కదలికలపై వాట్సాప్ ద్వారా హెచ్చరికలు.. పవన్ కల్యాణ్ న్యూ ప్లాన్
Read latest AndhraPradesh News And Telugu News