Minister Gottipati Slams Jagan: జగన్‌కు.. రచ్చ చేయడం అలవాటే
ABN , Publish Date - Jul 18 , 2025 | 04:52 AM
చిత్తూరు జిల్లాలో 90% మామిడి పంట మొత్తం కొనుగోలు చేశాం. ప్రభుత్వం రైతులకు..

పంట కొనుగోలు పూర్తయ్యాక మేల్కొన్నారు : మంత్రి గొట్టిపాటి
పిడుగురాళ్ల, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు జిల్లాలో 90% మామిడి పంట మొత్తం కొనుగోలు చేశాం. ప్రభుత్వం రైతులకు కేజీకి రూ.4 చెల్లించింది. అంతా అయిపోయిన తర్వాత మేల్కొన్నాడు. మాజీ సీఎం జగన్‌కు రచ్చ చేయడం ఓ అలవాటుగా మారింది’ అని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం పల్నాడు జిల్లా నడికూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో కిసాన్ మేళాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘రైతుల నుంచి పంట కొనుగోలు చేశాక బంగారుపాళ్యం వచ్చిన జగన్ నాలుగు ట్రక్కుల మామిడి కాయలను రోడ్డుపై పోయించి, తొక్కించి నానా యాగీ చేశాడు. నల్లబర్లీ పొగాకు చివరి ఆకు వరకు రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు సీఎం చంద్రబాబు రూ.280 కోట్లు విడుదల చేశారు. అధిక సాగు, అధిక దిగుబడుల వల్లే కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. రైతులకు 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది’ అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్‌బాబు, టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్