Kanhaiya Naidu: శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కన్నయ్య.. కీలక సూచన
ABN , Publish Date - Jul 06 , 2025 | 04:04 PM
గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు.. ఆదివారం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నిర్వహాకులకు ఆయన పలు కీలక సూచనలు చేశారు.

నంద్యాల, జులై 06: శ్రీశైలం ప్రాజెక్ట్‌ను గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఆదివారం పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్‌లోని జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల ప్రస్తుత పరిస్థితిని ఆయన అంచనా వేశారు. ఈ రేడియల్ క్రస్ట్ గేట్లకు క్రమం తప్పకుండా.. పెయింటింగ్ వేస్తూ ఉండాలని ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. అయితే జలాశయం గేట్ల ప్రస్తుత పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. మరికొన్నేళ్ల వరకు వీటి పరిస్థితి బాగానే ఉంటుందని పేర్కొన్నారు.
తర్వాత ఈ గేట్లను మార్చాల్సి ఉంటుందని నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్ గేట్లను మార్చకుంటే.. తుంగభద్ర జలాశయం విషయంలో జరిగిన ఘటన పునరావృతమయ్యే అవకాశముందని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు వివరించారు. జలాశయం నుండి 60 మీటర్ల దూరంలో ప్లంజ్ పూల్ ఏర్పడిందన్నారు. ప్లంజ్ పూల్ వల్ల శ్రీశైలం జలాశయానికి ప్రమాదం లేదని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్ట్ అధికారులతోపాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు.. కన్నయ్య నాయుడు వెంట ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తొలి ఏకాదశి.. ఉజ్జయిని మహాకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు
క్యాన్సర్ కణాలను నియంత్రించే సింపుల్ చిట్కా..
For More Andhrapradesh News And Telugu News