BC Janardhan Hit Out Jagan: సలహాలు ఇవ్వకుండా విమర్శలు చేస్తారా?.. జగన్‌పై మంత్రి సీరియస్
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:03 PM
ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.
నంద్యాల, నవంబర్ 1: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YSRCP Chief YS Jaganmohan Reddy) మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం నాడు నంద్యాల కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇంత పెద్ద విపత్తు వస్తే ప్రతిపక్ష నేత ప్రభుత్వానికి తన సలహాలు, సూచనలు అందజేయాల్సింది పోయి.. విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పక్షంలో ఉన్నా ప్రజల కష్టాల్లో వెన్నంటి ఉండే నాయకుడు చంద్రబాబు అని అన్నారు. గతంలో ప్రతిపక్షనేతగా నెల్లూరు జిల్లాలో తుఫాను వస్తే ప్రజలకు భరోసా ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి హోదాలోనూ తన అనుభవంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశంసించారు. ఎక్కడో బెంగుళూరులో ఉండి.. నేడు వైసీపీ నేతలతో రివ్యూ పెట్టి మాట్లాడటం జగన్ కు సరైన పద్ధతి కాదన్నారు. తమ నాయకుడు, ప్రభుత్వం, అధికారుల గురించి మాట్లాడే అర్హత జగన్ మోహన్ రెడ్డికి లేదని ఆగ్రహించారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్.. కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం నిజంగా దౌర్భాగ్యమన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ప్రజల్లోకి వెళ్లి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన బాధ్యత జగన్‌కు లేదా అని ప్రశ్నించారు. రాత్రికి తాడేపల్లి వచ్చి.. తెల్లవారగానే బెంగళూరుకు పారిపోయే జగన్ రెడ్డి మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందంటూ ఎద్దేవా చేశారు. తమది ప్రజా ప్రభుత్వమని, రైతు ప్రభుత్వమని, అనుకూల ప్రభుత్వమని, ప్రజల కష్టాల్లో వెన్నంటే నిలిచే ప్రభుత్వమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్
కాశీబుగ్గ ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News