Kasibugga Tragedy: కాశీబుగ్గ ఘటనలో బాధ్యులపై చర్యలు తప్పవు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 01 , 2025 | 03:02 PM
తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. కానీ, తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరమన్నారు సీఎం చంద్రబాబు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని... విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా, నవంబర్ 1: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidi) స్పందించారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. కాశీబుగ్గపట్నంలో ఒక ప్రైవేటు వ్యక్తి వేంకటేశ్వరస్వామి దేవాలయం కట్టారని.. కార్తీకమాసం సందర్భంగా చాలా మంది దర్శనానికి వెళ్లారని సీఎం తెలిపారు. దీనిపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే బందోబస్తు పెట్టేవాళ్లమని చెప్పారు. తొక్కిసలాట ఘటనలో 10 మంది చనిపోయారని.. ఇది చాలా బాధాకరమని ఆవేదన చెందారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజల ప్రాణాలు తీయడం బాధాకరమని.. దీనిని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
తుపానులో ముందస్తు ప్రణాళిక ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం లేకుండా చూడగలిగామని.. తొక్కిసలాటలో ఇంతమంది మృతి చెందటం బాధాకరమన్నారు చంద్రబాబు. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుందని... విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడానికి వీలు లేదన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేవుడు సన్నిధిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని బాధపడ్డారు. కాశీబుగ్గలో జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
ఇవి కూడా చదవండి...
షాకింగ్ ఘటన... జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలిపై అత్యాచారం
కాశీబుగ్గకు బయలుదేరిన మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News