Minors Missing: ఒకరు ఎనిమిదో తరగతి.. మరొకరు తొమ్మిదో తరగతి.. విజయవాడ టు హైదరాబాద్..
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:37 PM
ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఎఫెక్ట్‌తో ప్రేమించుకున్న ఆ విద్యార్థులు.. ఇంటి నుంచి పారిపోయి స్వతంత్రంగా ఉండాలని భావించారు. వివరాల్లోకి వెళితే..
విజయవాడ, నవంబర్ 28: ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా దిగుతారు ప్రేమికులు. జీవితంలో స్థిరపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారి లైఫ్ ఆనందంగా సాగిపోతుంది. కానీ ఇప్పుడు ఉన్న యువత అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. వయస్సు ఆకర్షనో, సినిమాల ప్రభావమో, సోషల్ మీడియా ఎఫెక్టో తెలియదు కానీ స్కూల్ ఏజ్‌లోనే పిల్లలు ప్రేమ అంటూ పిచ్చిపనులు చేస్తున్నారు. ప్రేమే లోకంగా భావిస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. చిన్న వయస్సుల్లోనే తప్పటడుగులు వేస్తూ జీవితాన్ని నాశనం చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోయేది ఇలాంటి ఘటనే. ఓ ఇద్దరు మైనర్లు ప్రేమ అంటూ ఇంట్లోంచి వెళ్లిపోయారు. వారి వయస్సు, వారు చదవే తరగతి గురించి తెలిస్తే షాక్ అవకుండా ఉండలేరు. చివరకు ఎలాగోలా పోలీసులకు చిక్కడంతో కథ సుఖాతమైంది.
విజయవాడ కృష్ణలంకలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమవడం కలకలం రేపుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థుల కోసం వేట మొదలు పెట్టారు. చివరకు వారి సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు అదృశ్యమైన విద్యార్థులను పట్టుకున్నారు. ఇంటి అద్దె కోసం తిరుగుతున్న మైనర్లను గుర్తించిన ఓ ఆటో డ్రైవర్ వారి వివరాలను తెలుసుకున్నాడు. ఆపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ లొకేషన్‌తో విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. ఆ ఇద్దరూ ప్రేమించుకున్నామని అనుకుని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు విచారణలో తేల్చారు. అయితే బాలిక తొమ్మిదో తరగతి చదువుతుండగా... బాలుడు ఎనిమిదో తరగతి చదువుతున్నట్లు తెలుసుకుని పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ప్రభావంతో ప్రేమించుకున్నామనుకున్న ఆ విద్యార్థులు.. ఇంటి నుంచి పారిపోయి స్వతంత్రంగా ఉండాలని భావించినట్లు తెలుస్తోంది. చివరకు పోలీసులకు చిక్కారు. కాగా.. పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు తల్లిదండ్రుల పరిశీలన ఉండాలని పోలీసులు చెబుతున్నారు. తమ పిల్లలను క్షేమంగా ఇంటికి చేర్చడంతో కృష్ణలంక పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో దక్కని ఊరట
వింత సంప్రదాయం.. వధువు వరుడిలా.. వరుడు వధువులా ముస్తాబు
Read Latest AP News And Telugu News