YV Subba Reddy CID: పరకామణి కేసు.. వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తున్న సీఐడీ
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:20 PM
పరకామణి కేసులో వైవీ సుబ్బారెడ్డిని సీఐడీ ప్రశ్నించింది. ఆయన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ను అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారించారు.
విజయవాడ, నవంబర్ 28: పరకామణి కేసులో సీఐడీ విచారణకు మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (Former TTD Chairman YV Subbareddy) హాజరయ్యారు. ఈరోజు (శుక్రవారం) విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న వైవీ సుబ్బారెడ్డిని అడిషనల్ డీజీ రవి శంకర్ అయ్యన్నర్ విచారించారు. రెండు గంటల పాటు విచారణ సాగగా.. వైవీ సుబ్బారెడ్డి స్టేట్‌మెంట్‌ను సీఐడీ అధికారులు రికార్డ్ చేశారు. రెండు రోజుల క్రితం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, సీఎస్‌వో నరసింహ కిషోర్‌లను సీఐడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి కేసు డాక్యుమెంట్లను సీఐడీ కార్యాలయానికి అధికారులు తెప్పించుకున్నారు.
డిసెంబర్ 2వ తేదీలోపు ఏపీ హైకోర్ట్‌లో కేసు నివేదికను సమర్పించాల్సి ఉంది. దీంతో ఈ కేసుకు సంబంధించి సీఐడీ కసరత్తు ముమ్మరం చేసింది. కాగా.. విచారణ అనంతరం వైవీ మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి విషయంలో తనను సీఐడీ ప్రశ్నించిందని.. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని తెలిపారు. తన హయాంలో దొంగతనం జరిగిందని అడిగారని అన్నారు. తన పిరియడ్ అయ్యాక ఇది బయట పడిందని ఆయన తెలిపారు. ఆరోజు ఈ విషయం ఎవరు దాచారో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఈ విచారణను రాజకీయ కోణంలో చూడవద్దని విజ్ఞప్తి చేశారు. టీటీడీ లడ్డూ, పరకామణి విషయంలో దోషులుగా చూడొద్దన్నారు. నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని కోరారు. విచారణకు అన్నివిధాలా సహకారం అందిస్తామని సీఐడీ అధికారులకు చెప్పామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
పిన్నెల్లి సోదరులకు సుప్రీంలో దక్కని ఊరట
Read Latest AP News And Telugu News