Gun Missing Case: అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:00 AM
గన్ మిస్సింగ్ కేసులో అంబర్‌పేట్ ఎస్‌ఐ భానుప్రకాష్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గన్ ఎక్కడపెట్టానో తెలీదంటూ ఎస్‌ఐ చెబుతున్నట్లు సమాచారం.
హైదరాబాద్, నవంబర్ 28: అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్ మిస్సింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గన్ మిస్సింగ్‌పై ఎస్‌ఐ భానుప్రకాష్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ పెట్టానో గుర్తులేదు అంటూ సమాధానాలు ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భాను ప్రకాష్ ఐదు నెలల క్రితమే గన్‌ను మిస్ చేశాడు. జర్నీలో ఎక్కడో బ్యాగ్ పోగొట్టుకున్నా అని చెబుతూ వచ్చాడు. అయితే గత ఐదు నెలల నుంచి గన్ మిస్ అయిన విషయాన్ని పై అధికారులకు చెప్పకుండా ఎస్‌ఐ దాచిపెట్టినట్లు తెలుస్తోంది.
మరొక ఉద్యోగం రావడంతో ఏపీకి వెళ్లేందుకు ఎన్వోసీని ఎస్‌ఐ అడుగగా.. సర్వీస్ రివాల్వర్ ఇవ్వాలని వారు సూచించారు. దీంతో అసలు బండారం బయటపడింది. ఎస్‌ఐ భానుప్రకాష్ తన గన్‌ను మిస్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అంబర్‌పేట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.
మరోవైపు పోలీసు శాఖకు మచ్చ తెచ్చే విధంగా ఎస్‌ఐ ప్రవర్తించినట్లు తెలుస్తోంది. బెట్టింగ్‌లను ఆపాల్సిన ఎస్‌ఐ.. విపరీతంగా బెట్టింగ్‌లు ఆడి లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా బెట్టింగ్ కోసం ఏకంగా తన పొలాన్నే అమ్ముకున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కడప జిల్లాలో ఉన్న రాయచోటిలో పొలాలను ఎస్‌ఐ అమ్ముకున్నాడు. దాదాపు రూ.96 లక్షలకు పైగా డబ్బులను ట్రాన్సాక్షన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి...
విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు
Read Latest Telangana News And Telugu News