Parthasarathi Challenge: ఆ సొమ్ము ఏం చేశారు.. వైసీపీకి ఏపీ మంత్రి ఛాలెంజ్
ABN , Publish Date - Jan 29 , 2025 | 02:54 PM
Parthasarathi: ‘‘మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా.. లేక విలాసాలకు మూర్ఖత్వపు ఆలోచనలకు ఆ సొమ్మును ఖర్చు చేశారు. మీరు అప్పు తెచ్చిన సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేస్తున్నా. పేదవారిని నిరుపేదలుగా చేయడానికి వైసీపీ నాయకులు అందరూ కలిసి గూడుపుఠానీ చేశారు’’ అంటూ మంత్రి పార్దసారధి అన్నారు.

అమరావతి, జనవరి 29: వైసీపీ చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం లేదని మంత్రి కొలుసు పార్ధసారధి (Minister Parthasarathi) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నెంబర్ 2 స్థానంలో ఉన్న వారు కూడా పార్టీని వదిలించుకోవాలని చూస్తున్నారు అంటే అర్ధం చేసుకోవాలన్నారు. వైసీపీ దిగజారుడు భావనలకు సాక్షి అద్దం పడుతూ వార్తలు రాస్తోందని మండిపడ్డారు. నీతి అయోగ్ చెప్పిన విషయాలపై చంద్రబాబును అనడం కరెక్ట్ కాదన్నారు. విపత్తుల ములంగా రాష్ట్రం లేదా దేశం నష్టపోతే ఏమీ చేయలేమని.. అలా కాకుండా ఓ వ్యక్తి వల్ల రాష్ట్రం నష్టపోతే క్షమించకూడదన్నారు. ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను పెంచకుండా మూర్ఖత్వపు పాలన ద్వారా మరింత దిగజార్చారని విమర్శించారు.
కూటమి ఏడు నెలల పాలనపై చర్చకు తాము ఎక్కడైనా సిద్ధమని.. అంతేగాని అవాస్తవాలు రాస్తామంటే మాత్రం కుదరదన్నారు. ‘‘మీరు తెచ్చిన అప్పును ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి ఖర్చు చేశారా.. లేక విలాసాలకు మూర్ఖత్వపు ఆలోచనలకు ఆ సొమ్మును ఖర్చు చేశారు. మీరు అప్పు తెచ్చిన సొమ్మును ఎలా ఖర్చు చేశారో చెప్పాలని ఛాలెంజ్ చేస్తున్నా. పేదవారిని నిరుపేదలుగా చేయడానికి వైసీపీ నాయకులు అందరూ కలిసి గూడుపుఠానీ చేశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ విషంలో బకాయిలు ఇవ్వకుండా వెళ్లిపోయావు ఆఖరుకు చిక్కిలు, కోడిగుడ్లకు బకాయిలు పెట్టావు. ఆరోగ్యశ్రీ బకాయిలు ఎన్నో పెట్టావు. చివరకు కనీసం 100 మందికి కూడా సీఎంఆర్ఎఫ్ కూడా ఇవ్వలేదు. ధాన్యం డబ్బులను మూడు నాలుగు నెలలు ఇవ్వకపోతే రైతుల పరిస్ధితి ఏంటి చెప్పాలి. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న జగన్ ఆలోచించాలి. ఎస్సీ, ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సింది 30 వేలకు తగ్గించావు. చివరకు కేంద్రం ఇచ్చిన నిధలను కూడా నువ్వు డైవర్ట్ చేశావు’’ అంటూ మంత్రి మండిపడ్డారు.
Maha Kumbh 2025: మహాకుంభమేళా తొక్కిసలాటపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
కేంద్రం నుంచి పోలవరానికి భారీగా డబ్బులు తెచ్చారని... వైసీపీ ఎందుకు తేలేకపోయారని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం కోసం 31 వేల కోట్లు తెచ్చిన ఘనత కూటమిసర్కార్ ది అని అన్నారు. 7 నెలల కాలంలో 6. 33 లక్షల కోట్లు అగ్రిమెంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యిందని తెలిపారు. ఇప్పటి వరకూ 4. 1 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 16 వేలకు పైగా టీచర్ల రిక్రూట్‌మెంటుకు నోటిఫికేషన్ ఈ ప్రభుత్వమే ఇచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లను పెద్ద ఎత్తున ఇస్తోంది ఏపీ మాత్రమే అని చెప్పుకొచ్చారు. 90 లక్షల మందికి ఉచిత సిలెండర్‌లు ఇచ్చామని మంత్రి పార్థసారధి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ISRO GSLV-F15: నింగిలోకి దూసుకుపోయిన GSLV F-15 రాకెట్.. ప్రయోగం
ఎమ్మెల్సీ ఎన్నికలకు మోగిన నగారా.. షెడ్యూల్ ఇదే..
Read Latest AP News And Telangana News And Telugu News