Share News

Tribute: జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి

ABN , Publish Date - Mar 03 , 2025 | 10:08 AM

తెలుగుదేశం నేత, లోక్ సభ తొలి దళిత స్పీకర్‌గా సేవలందించిన దివంగత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్‌గా ఎదిగిన బాలయోగి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు.

Tribute: జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి
Minister Lokesh pays tribute to GMC Balayogi

అమరావతి: దేశంలోనే అత్యున్నతమైన లోక్ సభ (Lok Sabha) తొలి దళిత స్పీకర్‌ (First Dalit Speaker)గా సేవలందించి దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన కోనసీమ ముద్దుబిడ్డ, టీడీపీ నేత (TDP Leader) స్వర్గీయ జీఎంసీ బాలయోగి (GMC Balayogi) వర్థంతి (Death Anniversary) సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఘన నివాళులు (Tribute) అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి అని, సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్ సభ స్పీకర్‌గా ఎదిగిన బాలయోగి జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ బాలయోగి ఆశయసాధనకు ప్రతి ఒక్కరం పునరంకితమవుదామని మంత్రి లోకేష్ పిలుపిచ్చారు.

ఈ వార్త కూడా చదవండి..

జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు


ఈ వార్తలు కూడా చదవండి..

సునీల్ కుమార్ నాయక్ విచారణ

ఉభయ సభల్లో 2025 -26 ఏపీ బడ్జెట్‌పై చర్చ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 03 , 2025 | 10:08 AM