Share News

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో కీలక పరిణామం

ABN , Publish Date - Nov 19 , 2025 | 02:12 PM

మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సర్కార్ అనుమతినిచ్చింది.

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో కీలక పరిణామం
AP Liquor Scam

అమరావతి, నవంబర్ 19: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో (AP Liquor Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్‌ స్కాంలో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్ ప్రక్రియకు సర్కార్ అంగీకారం తెలిపింది. కీలక నిందితుడైన వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ స్కాంలో చెవిరెడ్డి కుటుంబం కమిషన్లు, కిక్ బ్యాక్‌లు తీసుకుని భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సిట్ తేల్చింది. సిట్ దర్యాప్తు నివేదిక, విన్నపం మేరకు చెవిరెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌కు అనుమతిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.


చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేరిట ఉన్న ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. కెవీఎస్ ఇన్ ఫ్రా ఎండీగా ఉన్న చెవిరెడ్డి లక్ష్మీకాంతమ్మ అలియాస్ లక్ష్మి పేరిట ఆస్తులతో పాటు.. సీఎంఆర్ ఇన్ ఫ్రా పేరిట చెవిరెడ్డి మరో కుమారుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పేరిట ఉన్న ఆస్తులను అటాచ్‌మెంట్ చేయనున్నారు.


మద్యం కుంభకోణం అక్రమాలతో చెవిరెడ్డి కుటుంబం రూ.63. 72 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టారని దర్యాప్తులో వెల్లడైంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆస్తుల విలువను కేవలం 8 కోట్ల 85 లక్షల 47 వేల 693గా తగ్గించారని సిట్ పేర్కొంది. రూ.54 కోట్ల 87 లక్షల 17 వేల 107 కంటే ఎక్కువ మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని సిట్ అధికారులు తేల్చారు. చెవిరెడ్డి కుటుంబం రూ.54.87 కోట్లపైగా మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా బ్లాక్ మనీగా మలచినట్లు గుర్తించింది. తిరుపతి జిల్లా చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్, తొట్టంబేడు జాయింట్ రిజిస్ట్రార్ల వద్ద రిజస్ట్రేషన్ చేసినట్లు బయటపడింది.


నెల్లూరు జిల్లా గూడూరు, పొదలకూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ల వద్ద రిజిస్ట్రరైన ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ప్రభుత్వం ఆదేశించింది. చిత్తూరు జిల్లా పుత్తూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిందితుడు చెవిరెడ్డి కుటుంబం పేర్లతో రిజిస్ట్రేషన్ అయినట్లు సిట్ గుర్తించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చెవిరెడ్డి కుటుంబం మోసపూరిత భూ లావాదేవీలు భారీగా చేసినట్లు సిట్ నిర్ధారించింది. వెండోడులోని అరబిందో ఫార్మాకు కేవీఎస్ ఇన్‌ఫ్రా ద్వారా 263.28 ఎకరాల భూమి కొనుగోలు, అమ్మకంలో మోసం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. తక్కువ సమయంలోనే భూమి విలువలను అసాధారణంగా పెంచి నల్లధనాన్ని తెల్లగా మార్చారని సిట్ నివేదించింది. ఈ లావాదేవీల ద్వారానే కేవీఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.13.3 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారని తేల్చింది. మద్యం కుంభకోణం నుంచి కమిషన్లు, కిక్ బ్యాక్‌లతో చెవిరెడ్డి కుటుంబం భారీగా స్థిర, చర ఆస్తులను కూడబెట్టారని దర్యాప్తులో బయటపడింది.


అవినీతి నిరోధక చట్టం, క్రిమినల్ లా లోని పలు సెక్షన్ల ప్రకారం అటాచ్‌మెంట్‌కు అనుమతించాలని ప్రభుత్వాన్ని సిట్ కోరింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ కోర్టులో దరఖాస్తు చేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు.


ఇవి కూడా చదవండి...

మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు

బాబా చూపిన బాటలోనే నడుద్దాం: మంత్రి లోకేష్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 02:43 PM