Birthday Wishes: చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, పవన్ కల్యాణ్..
ABN , Publish Date - Apr 20 , 2025 | 08:05 AM
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వజ్రోత్సవ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) 75వ పుట్టినరోజు (75th birthday) సందర్బంగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer), ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) శుభాకాంక్షలు (Wishes) తెలియజేశారు. "దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఝాయుషు ఇవ్వాలని. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ప్రజా సేవలో సుదీర్ఘ కాలం ఉండాలని" ఆకాంక్షిస్తున్నానని గవర్నర్ సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.
.
Also Read..: క్షమాపణ చెప్పిన స్టార్ డైరక్టర్..
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..
అనితర సాధ్యుడు సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పవన కల్యాణ్ వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం.. నారా చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యమని అన్నారు. అటువంటి పాలనాదక్షునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలని మరోసారి తెలిపారు.
నాలుగో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతమని పవన్ కల్యాణ్ కొనియాడారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకమన్నారు. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన ఆయనకు సంపూర్ణ ఆయుష్షును, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని పవన్ అన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం నాటికి 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజిత రాష్ట్రానికి సీఎంగా ఆయన పని చేశారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. 2024 ఎన్నికల్లో 164 సీట్లతో గెలిచి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నాయకులంతా వారి ప్రాంతాల్లోని ఆలయాల్లో పూజలు నిర్వహించాలని కోరారు. చంద్రబాబు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవాలన్నారు. అన్ని మతాల వారు టీడీపీ కార్యకర్తలు, నేతలుగా ఉన్నారన్న ఆయన.. మసీదులు, చర్చిల్లోనూ ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు. దేశ ఔన్నత్యాన్ని చాటుతూ చంద్రబాబు కోసం పూజలు, ప్రార్థనలు చేయాలన్నారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం ఆత్మకూరులో పెద్ద ఎత్తున హోమం చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆ రెండు వేల మందిపై చర్యలు తీసుకుంటారా..
For More AP News and Telugu News