Share News

Dhulipalla Criticized Jagan: ఆపద కాలంలో జగన్ వ్యాఖ్యలు అర్థరహితం..

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:39 PM

ఆపద సమయంలో ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమని ధూళిపాళ్ల అన్నారు. జగన్ చేసే వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే అని ఆరోపించారు. బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చుని జగన్ చేసే వ్యాఖ్యలు ఎవరూ నమ్మరని తెలిపారు.

Dhulipalla Criticized Jagan: ఆపద కాలంలో జగన్ వ్యాఖ్యలు అర్థరహితం..
Dhulipalla Criticized Jagan

అమరావతి, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధ్వంసం జరిగితే చూసి ఆనందించాలన్నదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy ) పంథా అని పొన్నూరు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ (MLA Dhulipalla Narendra Kumar) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అనుకున్న విధ్వంసం జరగలేదనే బాధ జగన్‌లో ఉందన్నారు. మోంథా తుపానును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోవడం చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఆపద సమయంలో ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. జగన్ చేసే వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే అని ఆరోపించారు. బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చుని జగన్ చేసే వ్యాఖ్యలు ఎవరూ నమ్మరని తెలిపారు.


ఇన్సూరెన్స్ కట్టకుండా పంట బీమా చెల్లించామని జగన్‌లా కూటమి ప్రభుత్వం అసత్యాలు చెప్పదన్నారు. పంట నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అప్పుడు సీఎంగా జగన్ పొలంలో అడుగు పెట్టలేదని.. ఇప్పుడు కూడా అడుగు పెట్టటం లేదని విమర్శించారు. ఆపద కాలంలో జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమని ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు గుప్పించారు.


జగన్ వ్యాఖ్యలు హాస్యాస్పదం: యనమల

తుపానును కూడా మానవ సృష్టి అని జగన్ అనటం హాస్యాస్పదమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. విపత్తులు అనేవి ప్రకృతి కోపానికి సంకేతాలని, వాటిని మనుషులు సృష్టించలేరని జగన్ గ్రహించాలని హితవుపలికారు. 2024 ఎన్నికల్లో కూటమి సృష్టించిన రాజకీయ తుఫాను మాత్రం జగన్‌ను, ఆయన పార్టీని పూర్తిగా చెరిపేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పుడూ ప్రకృతి విపత్తుల ప్రాంతాలను సందర్శించలేదన్నారు. బెంగుళూరులో ఆస్తులను రక్షించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే జగన్‌కు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ముందస్తు, తుఫాను తదనంతర చర్యలు ప్రశంసనీయమని కొనియాడారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల యజ్ఞం ప్రజల మద్దతు లేకుండా కేవలం నకిలీ సంతకాలతో నడుస్తోందని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..

పాండురంగ స్వామి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 07:18 PM