NTR Medical Services: సమ్మె విరమణ.. ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:58 PM
నవంబర్ 15లోపు 250 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోషియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి, అక్టోబర్ 31: ప్రభుత్వ ఆస్పత్రుల అసోషియేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో సమ్మె విరమించాలని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయించింది. వైద్య సేవా పథకం కింద సేవలన్నింటినీ పున:ప్రారంభించాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్యసేవల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్‌తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమర్ యాదవ్ (Minister Satyakumar Yadav) చర్చలు జరిపారు. వెంటనే రూ.250 కోట్ల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో ప్రభుత్వ ఆస్పత్రుల అసోషియేషన్ సమ్మె విరమించింది.
నవంబర్ 15లోపు 250 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని అసోషియేషన్ వెల్లడించింది. అన్ని బకాయిల పరిష్కారానికి ఒకేసారి సెటిల్‌మెంట్ విధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని పేర్కొంది. ఈ నిర్ణయాలు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటనను విడుదల చేసింది. తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన సీఎం చంద్రబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ట్రస్ట్ వైస్ ఛైర్మన్ సుధాకర్, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి, వైద్య సేవ ట్రస్ట్ సీఈవోకు అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి...
దారుణం.. భర్త సోదరుడిని సుఖ పెట్టాలంటూ..
పాండురంగ స్వామి ఉత్సవాలు.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి
Read Latest AP News And Telugu News