Share News

CM Chandrababu: అప్పుడు పర్వాలేదు.. కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు.. మంత్రులకు సీఎం క్లాస్

ABN , Publish Date - Feb 06 , 2025 | 03:54 PM

CM Chandrababu: రాష్ట్ర మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై పెర్ఫార్మెన్స్‌ను చదివి వినిపించిన సీఎం... పనితీరును మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారన్నారు.

CM Chandrababu: అప్పుడు పర్వాలేదు.. కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు.. మంత్రులకు సీఎం క్లాస్
CM Chandrababu

అమరావతి, ఫిబ్రవరి 6: కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దిశానిర్దేశం చేశారు. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో వేరుగా భేటీ అయిన ముఖ్యమంత్రి.. పలు కీలక అంశాలను పేర్కొన్నారు. అందరూ గేర్ మార్చాలని.. పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు సీఎం. మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై పెర్ఫార్మెన్స్‌ను సీఎం చదివి వినిపించారు. మొదటి ఆరునెలలు పర్వాలేదని.... ఇక ఊరుకునేది లేదన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారు. ‘‘శాఖలపరంగా ఇక మీరు పెర్ఫార్మెన్స్ పెంచాలి. అందరు గేర్ అప్ కావాలి. కేంద్ర బడ్జెట్ వచ్చింది.. మార్చ్‌లో మన బడ్జెట్ వస్తుంది. ఢిల్లీలో వివిధ శాఖల్లో మిగిలిపోయిన బడ్జెట్ ఉంటుంది.. ఆ నిధులను మనం తెచ్చుకోవాలి’’ అని సూచించారు.


ప్రజల నుంచి మంచి స్పందన...

సచివాలయం సిబ్బందిలో ఐదుగురికి ఎంపిక చేసి ఒక్కో మండలానికి ఒక్కొక్కరిని పెట్టుకోవాలని.. వీళ్ళకు ఒక ప్రొఫెషనల్ ఉంటారని.. వీళ్ళకు ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటారని తెలిపారు. వీళ్లు జీఎస్‌డీపీపై దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. వాట్స్‌ ఆప్ గవరెన్స్‌కు మంచి స్పందన వస్తుందని అన్నారు. రెగ్యులర్‌గా సర్వేలు చేయిస్తున్నానని.. అన్ని పథకాలపై ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందన్నారు. దీనిని ఇంకా మరింత పెంచుకోవాలని చెప్పారు. ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభంకాక ముందే తల్లికి వందనం నిధులు వేస్తామని.. అలాగే డీఎస్సీ నియామకాలను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ద్రవ్యోల్బణంపై ఆర్థికశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ రెగ్యులర్‌గా మానిటరింగ్ జరిగాలన్నారు. దావోస్‌లో గ్రీన్‌ ఎనర్జీ, హైడ్రోజన్ ఎనర్జీతో పాటు వివిధ అంశాలపై మంచి ఫీడ్ బాక్ వచ్చింది.. మన బ్రాండ్ ఇమేజ్ బాగుందని మంత్రులకు సీఎం చెప్పారు.


జగన్‌కు మతి భ్రమించింది.. పయ్యావుల విసుర్లు


ఆ భయం అక్కర్లేదు..

అయితే యూఎస్ నుంచి తెలుగు వాళ్లు వెనక్కు పంపుతున్నారు కదా అని మంత్రులు ప్రశ్నించారు. అయితే భయం అక్కర్లేదని.. తెలుగు వాళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని.. అందరికి వీసాలు ఉన్నాయని తెలిపారు. ఆప్కోస్‌ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా ఎవరికి వారు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ చేసుకోమని సీఎం చెప్పారు. వైసీపీ అధికారంలోకి రాకముందు ఉన్న విధానాన్నే అనుసరించాలని మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.


ఇవి కూడా చదవండి...

మోడీ వినూత్న ఆలోచన.. విద్యార్థుల కోసం ఏకంగా..

మీ భార్య అకౌంట్‌కు డబ్బులు పంపుతున్నారా? ఈ రూల్ తెలుసుకోండి..

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 06 , 2025 | 04:20 PM