CM Chandrababu Naidu: విశాఖ సీఐఐ సమ్మిట్.. చంద్రబాబు పర్యటన అప్‌డేట్స్
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:52 PM
విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపనున్నారు. వరుస సమావేశాలతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
అమరావతి, నవంబర్ 12: ఈనెల 14,15 తేదీల్లో విశాఖలో నిర్వహించే 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విశాఖ పర్యటన వివరాలు, ఎవరెవరిని కలువనున్నారు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు తదితర వివరాలను అధికారులు వెల్లడించారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ఈరోజు (బుధవారం) సాయంత్రం అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి ముఖ్యమంత్రి నేరుగా విశాఖకు వెళ్లనున్నారు.
సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుకోనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో నిర్వహించే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ సన్నాహకాలపై అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష చేయనున్నారు. ఈరోజు రాత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో చంద్రబాబు భేటీ కానున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు వరుసగా వన్ టు వన్ భేటీలు, సమావేశాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో విశాఖ నుంచే ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
నవంబర్ 13, 14, 15 తేదీలో సీఎం షెడ్యూల్ ఇదే..
నవంబర్ 13 (గురువారం):
• భాగస్వామ్య సదస్సుకు తరలివస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో గురువారం వరుస భేటీలు.
• గురువారం నోవాటెల్ హోటల్‌లో ఉదయం ‘ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశం’లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
• ‘పార్ట్‌నర్స్ ఇన్ ప్రోగ్రెస్’ – సస్టైనబుల్ గ్రోత్‌పై ప్రారంభ సెషన్‌లో సీఎం పాల్గొంటారు.
• తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు.
• ‘వైజాగ్ ఎకనామిక్ రీజియన్’పై జరిగే కార్యక్రమానికి సీఎం హాజరుకానున్నారు.
• సీఐఐ నేషనల్ కౌన్సిల్ నిర్వహించే ప్రత్యేక సమావేశానికి హాజరు
• గురువారం చివరిగా నెట్వర్క్ డిన్నర్‌లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
నవంబర్ 14 (శుక్రవారం):
• నవంబర్ 14న సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం.
• సదస్సుకు ముఖ్య అతిధిగా ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హాజరుకానున్నారు.
• సమావేశానికి వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విచ్చేయనున్నారు.
• మొదటగా ఏపీ పెవిలియన్‌కు ప్రారంభోత్సవం.
• ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సెషన్‌లో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం.
• సదస్సు నుంచే ఏపీలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీల ప్రారంభం.
• సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులపై ఒప్పందం.
• ఏపీ రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్’లో సీఎం ముఖ్య ప్రసంగం.
• విశాఖలో లులూ మాల్‌కు శంకుస్థాపన.
• శుక్రవారం చివరిగా బిజినెస్ టుడే ఇంటర్వ్యూ, గాలా డిన్నర్‌కు సీఎం వెళ్లనున్నారు.
నవంబర్ 15 (శనివారం):
నవంబర్ 15న జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి వరుసగా సమావేశాలు కానున్నారు.
• గూగుల్, శ్రీ సిటీ, రేమండ్, ఇండోసోల్ వంటి ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమాలు.
• బహ్రెయిన్, న్యూజిలాండ్, జపాన్, కెనడా, మెక్సికో ప్రతినిధులతో సీఎం భేటీలు.
• ‘గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ’, ‘సస్టైనబుల్ సిటీస్’, ‘ఆంధ్ర టూరిజం విజన్’ సెషన్లు.
• మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ‘ఏఐ అండ్ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’పై ముఖ్య చర్చ.
• ‘ఇన్వెస్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్ : ఎన్ఆర్టీస్ ఫర్ వికసిత్ భారత్’ పై సీఎం సమీక్ష.
• సదస్పులో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా బ్రీఫింగ్, వాలెడిక్టరీ సెషన్ నిర్వహణ.
మొత్తంగా సదస్సులో 100కి పైగా అంతర్జాతీయ ప్రతినిధులతో సమావేశాలు, 30కి పైగా ఒప్పందాలపై సంతకాలు జరుగనున్నాయి. అలాగే ఏఐ, స్పేస్, గ్రీన్ హైడ్రోజన్, టూరిజం, ఎంఎస్ఎంఈ, ఫైనాన్స్ రంగాలపై కీలక చర్చలు జరుగనున్నాయి. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు, భారీఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సదస్సు నిర్వహించనున్నారు. విశాఖ సమ్మిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నద్ధం చేశారు. సదస్సుల్లో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. సమ్మిట్‌ను విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఇతర మంత్రులు ఇప్పటికే దేశ విదేశాల్లో పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ రోడ్ షోలు, పర్యటనలు చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
మూడు కోట్ల విలువైన వస్తువులు సీజ్.. విమానాశ్రయంలో కలకలం
పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్
Read Latest AP News And Telugu News