Sardar Patel Jayanti: సర్దార్కు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన నివాళులు
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:45 AM
సర్దార్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన నివాళులర్పించారు.
అమరావతి, అక్టోబర్ 31: భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (Sardar Patel Jayanti) సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఘన నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మహనీయుడు సర్దార్‌ను స్మరించుకున్నారు. జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి పటేల్ అని ముఖ్యమంత్రి అన్నారు. దేశ ఐక్యతకు సర్దార్ ఎంతో కృషి చేశారని మంత్రి లోకేష్ వెల్లడించారు.
చంద్రబాబు ట్వీట్..
‘భారత రాజ్యాంగంలో పౌరులకు ప్రాథమిక హక్కులు మాత్రమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా ప్రతి పౌరుడిదని బోధించిన మహానీయ దార్శనికుడు... ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి, జాతీయ ఐక్యతకు పునాది వేసిన సుస్థిర జాతి శిల్పి... దేశ సమగ్రతకు మార్గదర్శకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆత్మస్ఫూర్తికి నివాళులు’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
మహనీయుని స్మృతికి నివాళులు: లోకేష్
‘ఉక్కుమనిషి, భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. దేశ ఐక్యతకు కృషిచేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ తొలి హోంమంత్రిగా, ఉప ప్రధానిగా విశేష సేవలు అందించారు. ధృడమైన సంకల్పం, అచంచల నాయకత్వం ఆయన సొంతం. జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలను స్మరించుకుందాం’ అంటూ మంత్రి లోకేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
క్యాన్సర్‌పై వారికి అవగాహన ఉండాల్సిందే: బోండా ఉమ
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. నేటితో ముగియనున్న గడువు
Read Latest AP News And Telugu News