Mayor Couple Murder: మేయర్ దంపతుల హత్య కేసు.. ఐదుగురికి ఉరిశిక్ష
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:12 AM
మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
చిత్తూరు: మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతులను హత్య చేసిన ఐదుగురికి ఉరి శిక్ష విధింస్తూ.. కోర్టు తీర్పు ఇచ్చింది. నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఎం.వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్, వెంకటేష్‌లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 2015 నవంబర్ 17న మేయర్ ఛాంబర్‌లోనే దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే.
పదేళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్యకేసుపై చిత్తూరు 6వ ADG కోర్టు ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టింది. కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ 2015 నవంబరు 17న నగరపాలక కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై చంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు 22 మందిపై పలు సెక్షన్ల కింద పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై 2022 నుంచి సాక్షుల విచారణ జరుగుతూ వచ్చింది. ఏ1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఏ2 వెంకటాచపలతి, ఏ3 జయప్రకాష్ రెడ్డి, ఏ4 మంజునాధ్, ఏ5 వెంకటేశ్‌లపై నేరం రుజువైంది. మిగిలిన 16 మందిపై కేసు కొట్టివేశారు.
అయితే.. ఈ మేరకు విచారణ చేపట్టిన ADG కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో చింటూ, కఠారి వర్గాలకు చెందిన వారు కోర్టు వద్దకు చేరుకున్నారు. దాంతో అక్కడ కొంత ఉత్కంఠ నెలకొంది. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. కోర్టు తీర్పు అనంతరం నిందితులను తిరిగి జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి..
Father Heartfelt Plea: ఓ తండ్రి ఆవేదన
Justice Suryakant: 53వ సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్