MP Kesineni Chinni: చంద్రబాబు ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరం..
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:47 AM
సీఎం చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వారని.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారని టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి కంప్యూటర్‌పైన ఉందంటే వాటిని పరిచయం చేసిన చంద్రబాబే కారణమని అన్నారు. స్వర్ఞాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా పి4 కార్యక్రమం ప్రారంభించారని... పేదలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు.

అమరావతి: ఎపీ మార్గదర్శకులు, విజనరీ లీడర్ ( Visionary leader) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) 75వ పుట్టిన రోజు సందర్భంగా టిడీపీ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) (TDP MP Kesineni Chinni) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ఇక్కడ పుట్టడం ఈ రాష్ట్రానికే కాదు దేశానికే వరమని అన్నారు. దేశాన్ని సరైన దిశలో నడపగల లీడర్లలో చంద్రబాబు ఒకరని.. వాజ్ పాయ్ ప్రధానిగా ఉన్న సమయంలో జాతీయ రహదారుల నిర్మాణం చంద్రబాబు ప్రారంభించారన్నారు. 2014లో రాష్ట్ర విభజనతో ఎపి నష్టపోయినా, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేసిన మొట్టమొదటి నేత చంద్రబాబు అని పేర్కొన్నారు.
Also Read..: టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు.
పశ్చిమ నియోజకవర్గం ఎంతో ప్రత్యేకం..
చంద్రబాబు విజన్ 2020 అంటే అందరూ నవ్వారని.. ఫలితాలు చూసి ఆశ్చర్యపోయారని కేశినేని చిన్ని అన్నారు. దేశ ఆర్ధిక పరిస్థితి కంప్యూటర్‌పైన ఉందంటే వాటిని పరిచయం చేసిన చంద్రబాబే కారణమని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో భాగంగా పి4 కార్యక్రమం ప్రారంభించారని... పేదలు ఆర్ధికంగా ఎదగాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు. నాకు పశ్చిమ నియోజకవర్గం ఎంతో ప్రత్యేకమని అన్నారు. చంద్రబాబుకు భక్తుడు, వీర విధేయుడు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఈ పుట్టిన రోజు వేడుకలు జరపడం ఆనందంగా ఉందని కేశినేని చిన్ని అన్నారు. పదవులు ఉన్నా లేకున్నా... చంద్రబాబు కోసమే పని చేసే వ్యక్తి బుద్దా వెంకన్న అని, నాగుల్ మీరా కూడా పార్టీ కోసం క్రమశిక్షణతో పని చేస్తున్నారని అన్నారు. తాను పశ్చిమ నియోజకవర్గం నుంచే ఏ కార్యక్రమం అయినా చేపడతానన్నారు. చంద్రబాబు మరో ఇరవై యేళ్లు రాష్ట్ర భవిష్యత్తును నిర్ధేశించేలా సిఎంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని కేశినేని చిన్ని అన్నారు.
రాష్ట్రంలో పండుగ వాతావరణం..
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోటో గ్యాలరీని ఆయన ప్రారంభించారు. సీఎం చంద్రబాబు మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి అని, ఆయన జన్మదినం రాష్ట్రానికి ఒక వరమని అన్నారు. 2019 తర్వాత ప్రజలు చంద్రబాబు వెలుగును గుర్తించి 2024లో అపూర్వ విజయం అందించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకుందని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని కేశినేని చిన్ని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
గుజరాత్ పర్యటనకు నారాయణ బృందం..
For More AP News and Telugu News