Budda Venkanna: జగన్ బయట ఉంటే ప్రమాదమే.. బెయిల్ రద్దు చేయాల్సిందే: బుద్దా వెంకన్న
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:24 PM
జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యాయస్థానాలకు రాకుండా కుంటిసాకులతో వాయిదా వేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు.
అమరావతి, నవంబర్ 20: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి ధ్వజమెత్తారు. కోర్టుకు వెళ్తూ పెళ్లి పీటలు ఎక్కే వాడిలా బిల్డప్ ఇస్తూ జగన్ కోర్టు బోనులోకి వెళ్లారంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు సిగ్గు శరం ఉందో లేదో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉండి రాష్ట్రాన్ని రాక్షస పాలనతో విధ్వంసం చేశారని విమర్శించారు. బిహార్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పేదలకు సేవ చేసే నాయకులు వెళ్లారని... జగన్ తప్పులు చేశారు కాబట్టి కోర్టులో ఉన్నారని.. ఇదే దేవుడి స్క్రిప్ట్ అని అన్నారు. 2020లో సీఎంగా నాంపల్లి కోర్టులో హాజరు అయ్యారని.. ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా హాజరు కావడం నిజమైన స్క్రిప్ట్ అంటూ దుయ్యబట్టారు.
ఇప్పటివరకు న్యాయస్థానాలకు రాకుండా కుంటి సాకులతో వాయిదాలు వేయించారని మండిపడ్డారు. ప్రజల కోసం వచ్చినట్లు రూట్ మ్యాప్‌లు ఇచ్చి కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదమన్నారు. కోర్టుకు వచ్చే టైమ్ కూడా జగనే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. న్యాయవ్యవస్థనూ జగన్ అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. జగన్‌లా చంద్రబాబు ఎప్పుడూ అవినీతి కేసులుపై జైలుకు వెళ్లలేదన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే 110 దేశాల్లో ఆయన కోసం ఆందోళనలు చేశారని... అదీ బాబు ట్రాక్ అంటూ చెప్పుకొచ్చారు.
జగన్ సీఎంగా ఉన్నా, ప్రతిపక్షంగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ లాంటి వ్యక్తులు బెయిల్ మీద ఉండటం ప్రమాదకరమని.. తన మాటను సుమోటోగా తీసుకుని జగన్‌కు బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేవుడిపై నమ్మకం ఉంటే జగన్ చేసిన తప్పులు ఒప్పుకుని జైలుకు వెళ్లాలన్నారు. కోర్టుల వద్ద కేరింతల సంస్కృతి ఎక్కడా చూడలేదని తెలిపారు. న్యాయ వ్యవస్థనూ భయబ్రాంతులకు గురిచేసే కుట్ర ఇది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ కులమతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మత ఘర్షణలు చేయించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది... ఇప్పుడు అదే మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారంటూ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఏపీ డీజీపీ స్పష్టం
తలసేమియా బాధితులకు అండగా ఉంటాం: మంచు మనోజ్
Read Latest AP News And Telugu News