Nara Bhuvaneshwari: కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
ABN , Publish Date - Nov 20 , 2025 | 03:08 PM
డీకే పల్లి వద్ద కృష్ణా జలాలకు నారా భువనేశ్వరి జల హారతి ఇచ్చారు. అంతకు ముందు గంగమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారె అందించడం తన పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు.
చిత్తూరు, నవంబర్ 20: కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం శాంతిపురంలోని తన నివాసంలో నారా భువనేశ్వరి గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అర్జీలను ఆమె స్వీకరించారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో నారా భువనేశ్వరిని కలిశారు. స్వచ్ఛ భారత్ అవార్డులు గెలుచుకున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను ఆమె అభినందించారు. దయాళ్ శ్రవణ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేసిన వినికిడి పరికరాలను పంపిణీ చేశారు.
అనంతరం డీకే పల్లి వద్ద కృష్ణా జలాలకు ఆమె జల హారతి ఇచ్చారు. అంతకు ముందు గంగమ్మ ఆలయంలో నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మకు చీర సారె అందించడం తన పూర్వ జన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు. కుప్పంలో ఇలా శ్రీశైలం నుంచి వచ్చిన కృష్ణా జలాలను చూడడం తన జన్మలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు.
నాలుగు రోజుల పాటు..
కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పాటు పర్యటించనున్నారు. అందుకోసం బుధవారం ఆమె కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు
ఆపరేషన్ సంభవ్ కొనసాగుతుంది.. ఏపీ డీజీపీ స్పష్టం
Read Latest AP News And Telugu News