Achchennaidu Letter Giriraj Singh: పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:57 PM
రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని కేంద్రమంత్రికి మంత్రి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు.
అమరావతి, నవంబర్ 6: రాష్ట్రంలో పత్తి రైతుల సమస్యలపై కేంద్ర టెక్స్ట్‌టైల్స్ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మంత్రి అచ్చెన్నాయుడు (Union Minister Atchannaidu) లేఖ రాశారు. మొంథా తుఫాను ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతిందని, రైతులు కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువ ధరలకు పత్తి అమ్ముకోవాల్సి వస్తోందని లేఖలో వెల్లడించారు. రాష్ట్రంలో 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు, 8 లక్ష మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం ఏపీపీ (CM APP), ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు డిజిటల్ విధానంలో నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ (Kapas Kisan App)ను రాష్ట్ర CM APPతో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో వివరించారు.
Kapas Kisan App నుంచి CM APPకు రైతుల వివరాలు రియల్ టైమ్‌లో సమన్వయం అయ్యేలా చేయాలని కోరారు. రైతులు సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలని అన్నారు. రైతులు దూరప్రాంతాలకు వెళ్లకుండా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వినతి చేశారు. Kapas Kisan App కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలని కోరారు. వర్షానికి తడిసిన లేదా రంగు మారిన పత్తిని తగిన ధరకు కొనుగోలు చేయాలన్నారు. సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
ఎస్వీయూ పీఎస్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తప్పవు: హోంమంత్రి
Read Latest AP News And Telugu News