Cyber Criminals: ట్రేడింగ్ యాప్ పేరిట కోటిన్నర రూపాయలు కొట్టేశారు
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:03 AM
ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతిలో ఉండే చైతన్య కుమార్, వెంకటేష్‌కు ఆన్లైన్ ద్వారా ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది..
తిరుపతి, నవంబర్ 6: ట్రేడింగ్ యాప్ పేరుతో సైబర్ నేరగాళ్లు కోటిన్నర రూపాయలు కొట్టేశారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డులోని డీమార్ట్ సమీపంలో ఉంటున్న చైతన్య కుమార్, వెంకటేష్‌కు ఆన్లైన్ ద్వారా ఒక గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అంగారి ట్రేడ్ యాప్‌లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభాలు వస్తాయని నమ్మించడంతో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు.
అనుకున్నట్టే యాప్ లో భారీగా లాభాలు చూపించాయి. దీంతో, లాభం వచ్చిన నగదును చైతన్య, వెంకటేష్ విత్ డ్రా పెట్టారు. ఎంతసేపు చూసినా.. డబ్బు అకౌంట్లో పడకపోవడంతో సదరు వ్యక్తికి ఫోన్ చేశారు. అతడి మొబైల్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయాయని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఇవి కూడా చదవండి:
Nara Lokesh: ప్రభుత్వ విద్యాలయాల్లో పరిపాలనపై మంత్రి ఆదేశాలు
Agriculture Minister: పరిహారమిచ్చినా ధాన్యం కొంటాం