Anitha Warns: తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తప్పవు: హోంమంత్రి
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:19 PM
విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని హోంమంత్రి అనిత తెలిపారు. కొండారెడ్డి యువతకు డ్రగ్స్ ఇచ్చి పాడు చేస్తుంటే జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
అమరావతి, నవంబర్ 6: వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండా రెడ్డి.. ఇటీవల డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CMYS Jagan Mohan Reddy), కొండారెడ్డి కలిసి ఉన్న ఫోటోలను హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) ఈరోజు (గురువారం) మీడియాకు విడుదల చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై హోంమంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డ్రగ్స్, గంజాయి ఏపీలో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రగ్స్ వద్దు బ్రో అని కూటమి ప్రభుత్వం అంటుంటే... వైసీపీ నేతలు డ్రగ్స్ కావాలి బ్రో అంటున్నారంటూ కామెంట్స్ చేశారు.
ఈగల్ వ్యవస్థను ప్రారంభించాక యువత డ్రగ్స్ వాడకం తగ్గించిందన్నారు. విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని తెలిపారు. కొండారెడ్డి యువతకు డ్రగ్స్ ఇచ్చి పాడు చేస్తుంటే జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కొండారెడ్డిని పార్టీ నుంచి జగన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని నిలదీశారు. డ్రగ్స్ వాడే వాళ్లకి పార్టీలతో సంబంధం లేదన్నారు. యూనివర్సిటీ విద్యార్థులకు కొండారెడ్డి డ్రగ్స్ ఇస్తున్నాడని తెలిపారు. తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీకి సింగర్ చిన్మయి ఫిర్యాదు
ఎస్వీయూ పీఎస్ వద్ద హైటెన్షన్.. భారీగా చేరుకుంటున్న విద్యార్థులు
Read Latest AP News And Telugu News