Prakasam: ఒంగోలులో మంత్రి లోకేష్‌కు ఘనస్వాగతం
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:12 AM
ఒంగోలు వద్ద మంత్రి నారా లోకేష్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టంగుటూరు టోల్‌గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను స్వాగతించారు.
ఒంగోలు, నవంబర్ 6: ప్రకాశం జిల్లా ఒంగోలు వద్ద మంత్రి నారా లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టంగుటూరు టోల్ గేట్ వద్ద ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను స్వాగతించారు. కందుకూరు నియోజకవర్గం తెట్టు వద్ద ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీ గజమాలతో మంత్రి లోకేష్‌కు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. పార్టీ జెండాలు, పుష్పగుచ్ఛాలు, జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది.

స్థానిక ప్రజలు, కార్యకర్తల నుంచి మంత్రి అర్జీలు స్వీకరించారు. ప్రతిఒక్కరిని ఆప్యాయంగా లోకేష్ పలకరిస్తూ, ఫోటోలు దిగుతూ ముందుకు సాగారు. మరికాసేపట్లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తిలో రాష్ట్ర ఆగ్రోస్ కార్పోరేషన్ ఛైర్మన్ దివంగత మాలేపాటి సుబ్బానాయుడు నివాసానికి లోకేష్ వెళ్లనున్నారు. మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఇవి కూడా చదవండి:
Hyderabad Drug Overdose: డ్రగ్స్ ఓవర్ డోస్‌తో వ్యక్తి మృతి
Cyber Criminals: ట్రేడింగ్ యాప్ పేరిట కోటిన్నర రూపాయలు కొట్టేశారు