Share News

Perninani Bail Petition: పేర్నినాని ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే

ABN , Publish Date - Jan 28 , 2025 | 03:59 PM

Perninani Bail: మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్నినాని ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానిని పోలీసులు ఏ6గా చేర్చారు. దీంతో అరెస్ట్ భయంతో మాజీ మంత్రి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

Perninani Bail Petition: పేర్నినాని ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో ఏం జరిగిందంటే
Former Minister Perni Nani

అమరావతి, జనవరి 28: మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు (AP High Court) రిజర్వ్ చేసింది. పేర్నినాని, ఆయన సతీమణి జయసుధపై ఉన్న గోడౌన్‌లో రేషన్ బియ్యం మాయం కేసులపై హైకోర్టులో ఈరోజు (మంగళవారం) వాదనలు జరిగాయి. మచిలీపట్నంలో పేర్ని సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోడౌన్‌లో పౌరసరఫరాల శాఖకు చెందిన బియ్యం మాయం కేసులో పేర్ని నానిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పేర్ని తరపున సీనియర్ న్యాయవాది రవి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తి అవడంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.


కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం‌కు సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్నినాని చుట్టూ వ్యవహారం నడుస్తోంది. అతనికి సంబంధించిన రెండు గోడౌన్లలో బియ్యం మాయం అవడం, బియ్యాన్ని ఉద్దేశపూర్వకంగా అమ్ముకున్నట్లు పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో విజిలెన్స్, సివిల్స్‌ సప్లై, పోలీస్ శాఖలు వివిధ కోణాల్లో విచారణ జరపాయి. అయితే ఉద్దేశపూర్వకంగానే బియ్యాన్ని పక్కదారి పట్టించినట్లు నిర్ధారించారు. గోడౌన్‌లు పేర్నినాని సతీమణి జయసుధ పేరు మీద ఉన్న నేపథ్యంలో ఆమెను ఏ1గా చేర్చారు. బియ్యం మాయం వెనక అప్పటి అధికారులు, లారీ డ్రైవర్, రైస్ మిల్లు ఓనర్లపై కేసులు నమోదు చేశారు. అయితే వారిచ్చిన సమాచారం మేరకు ఏ6గా పేర్నినాని చేర్చారు పోలీసులు. విషయం తెలుసుకున్న వెంటనే హైకోర్టులో పేర్నినాని ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు.

TDP on Tulasibabu: ఆ ఆరోపణల్లో నిజం లేదు.. తులసిబాబు వ్యవహారంపై టీడీపీ


అలాగే ఏ1గా ఉన్న జయసుధతో పాటు మిగిలిన వారికి మచిలీపట్నం జిల్లా కోసం ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. జయసుధ‌కు మాత్రం ముందస్తు బెయిల్‌ తీసుకోవడంతో పాటు విచారణకు సహకరించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో అరెస్ట్ భయంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే నాలుగు విడతలుగా వాయిదా పడింది. ఇరువర్గాల న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ఈరోజు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది.. పేర్నినానిని అరెస్ట్ చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.


ఇవి కూడా చదవండి...

‘భరోసా’ పడిందోచ్..

మీ వద్ద ఈ గేదెలు ఉంటే పంట పండినట్లే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 04:01 PM