Share News

AP 10th Results: ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు..

ABN , Publish Date - Apr 23 , 2025 | 07:30 AM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. టెన్త్‌తో పాటు ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. ఫలితాలను ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేస్తారు.

AP 10th Results: ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు..
AP 10th Class Results

AP 10th Results: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (10th Results) బుధవారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ యాప్‌లోనూ విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. అలాగే వాట్సప్‌ నంబర్‌ 9552300009కు హాయ్‌ అని మెసేజ్‌ చేసి, విద్యా సేవల ఆప్షన్‌ ద్వారా ఫలితాలను పీడీఎఫ్‌ కాపీ రూపంలో పొందవచ్చు. ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ఫలితాలు కూడా టెన్త్‌ ఫలితాలతో పాటే విడుదల చేస్తారు.

Also Read..: పచ్చని కొండల్లో నెత్తుటేర్లు


ఫలితాలు ఇలా కూడా తెలుసుకోవచ్చు..

విద్యార్థులు తమ మొబైల్‌ ఫోన్‌లోని వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు "Hi" అని మెసేజ్ చేయాలి. వెంటనే సేవను ఎంచుకోండి అనే ఆప్షన్‌ వస్తుంది. అందులో విద్యా సేవలను ఎంచుకోవాలి. అనంతరం SSC పబ్లిక్ పరీక్షల ఫలితాలను సెలక్ట్‌ చేయాలి. అక్కడ రోల్ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి. ఈ రిజల్ట్‌ పీడీఎఫ్‌ (PDF) కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే.. పదో తరగతి రెగ్యులర్‌ పబ్లిక్‌ పరీక్షలతో పాటు ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఓపెన్‌ స్కూల్‌ ఇంటర్‌ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు. ఈ ఓపెన్‌ స్కూల్‌ టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలను https://apopenschool.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.


కాగా ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్‌ మీడియంకు సంబంధించి 5,64,064 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. తెలుగు మీడియంలో 51,069 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం దోపిడీ రూ. 3200 కోట్లు

ఇంటర్‌లో బాలికలదే పైచేయి

For More AP News and Telugu News

Updated Date - Apr 23 , 2025 | 07:35 AM