Share News

Kadapa News: లోన్‌ యాప్‌... తస్మాత్‌ జాగ్రత్త

ABN , Publish Date - Nov 22 , 2025 | 08:12 AM

లోన్‌ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్‏ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

Kadapa News: లోన్‌ యాప్‌... తస్మాత్‌ జాగ్రత్త

- అవసరమని తీసుకుంటే.. మీ అకౌంటును ఖాళీ చేస్తారు

- ఆన్‌లైన్‌ యాప్‌లతో వేధింపులు తప్పవు

- 11 నెలల్లో 271 ఫిర్యాదులు.. రూ.42లక్షలు పైనే స్వాహా

కడప: మన ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని వేధింపులకు, ఆర్థిక మోసాలకు పాల్పడే ఫేక్‌ లోన్‌ యాప్‌లు పుట్టగొడుగుల్లా పుట్టుకొ స్తున్నాయి. ఈ రుణ యాప్‌ల వలలో చిక్కుకొని కొందరు విలవిలలాడుతున్నారు. తమ అవసరాల కోసం రుణాలు పొందిన వారి నుంచి అంతకు పదిం తలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఒకవేళ డబ్బులు కట్టకపోతే మొబైల్‌లో ఉన్న డేటా దొంగలించి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి కాంటాక్టులో ఉన్న అందరికీ షేర్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతుంటారు. ఒకప్పుడు పర్సనల్‌ లోను తీసుకోవాలంటే చాల పెద్ద ప్రాసెస్‌ ఉండేది. బ్యాంకుల్లో లోను కోసం దరఖాస్తు చేస్తే ఆ వ్యక్తి ఆదాయ వివరాలు అన్నీ పరిశీలించిన తరువాత రుణం మంజూరు చేయాలా లేదా అని నిర్ణయించేవారు. ఈ ప్రాసెస్‌ మొత్తం రెండు మూడు వారాల నుంచి నెలల సమయం పడుతుం డేది. ఇప్పుడు పర్సనల్‌ లోను తీసుకోవాలంటే మంచి క్రెడిట్‌ హిస్టరీ ఉంటే ఆన్‌లైన్‌లో పది నిమిషాల్లోనే రుణం పొందవచ్చు.


సోషల్‌ మీడియాలో వచ్చే లోన్‌ యాప్‌లను నొక్కి మనకు కావలసిన అమౌం టుతో పాటు మన వ్యక్తిగత వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. అయితే సదరు సంస్థలకు సకాలంలో రుణాలు చెల్లించకపోతే యాప్‌ల నిర్వాహకులు వేధింపులు మొదలు పెడ తారు. వీళ్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా గతంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి సోషల్‌ మీడియాలో వచ్చే నకిలీ యాప్‌ల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్పిన అవసరం ఎంతైనా ఉంది.


వేధింపులు తాళలేక...

జిల్లాలో యాప్‌ల ద్వారా లోన్లు పొందిన వారు 11 నెలల్లో దాదాపు 271 మంది ఉన్నా రంటే.. ఎలా మోసపోతున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇక లోను యాప్‌ల ద్వారా లోన్‌ తీసుకున్న వారు తీసుకున్న డబ్బుల కంటే దాదాపు 42 లక్షల వరకు అధిక వసూళ్లకు పాల్పడ్డారు. దీంతో లోను యాప్‌ నిర్వాహకుల వేధింపులు తాళలేక చివరికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి లోను యాప్‌లపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


ap1.jpg

నకిలీ యాప్‌లే ఎక్కువ

తమ అవసరాల నిమిత్తం డబ్బు కోసం సోషల్‌ మీడియాను కొంతమంది వేదికగా చేసుకుంటున్నారు. అందులో వచ్చే ప్రకటనలకు ఆకర్షితులై లింకులు క్లిక్‌ చేసి తమ వ్యక్తిగత సమాచారం ఇవ్వడంతో వారి మొబైల్‌లో ఉన్న డేటాను సైబర్‌ నేరగాళ్లు కొట్టేస్తారు. మొత్తం మన మొబైల్‌లో ఉన్న అన్ని కాంటాక్టు నెంబర్లు, ఫొటోలు, డేటాను యాక్సస్‌ చేసుకుంటారు. ఇది లోన్‌ తీసుకున్నవారి పాలిట శాపంగా మారుతుంది. ఇలాంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మోసపోయిన బాధితుల్లో కొందరు...

- కడపకు చెందిన ఓ యువతి తన అవసరాల కోసం రుణయాప్‌ ద్వారా రూ.50వేలు తీసుకుంది. తీసుకున్న డబ్బు కంతుల వారీగా చెల్లించింది. అయినా సైబర్‌ నేరగాళ్లు ఆ యువతినే డబ్బులు కట్టాలంటూ వేధింపులకు గురి చేశారు. తాను తీసుకున్న డబ్బులు కంటే అధికంగా డబ్బులు చెల్లించానని చెప్పినా టార్చర్‌ పెట్టారు. వాళ్ల టార్చర్‌ భరించిలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది.


- కడపకు చెందిన ఓ వ్యక్తి వ్యాపార అవసరాల నిమిత్తం రూ.32లక్షలు ఈ నకలీ యాప్‌ ద్వారా లోను పొందారు. అయితే అతను తిరిగి డబ్బులు చెల్లిస్తున్నా మిగతా డబ్బులు కూడా కట్టాలని, లేకుంటే నీ ఫొటోలు కాంటాక్టులందరికీ పంపిస్తానని బెదిరింపులకు పాల్పడడంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించారు.

- ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ లోను యాప్‌ ద్వారా రుణం తీసుకుంది. డబ్బులు చెల్లించినప్పటికీ మళ్లీ డబ్బులు కట్టా లని రకరకాల నెంబర్ల నుంచి అతన్ని టార్చర్‌ పెట్టడం మొదలు పెట్టారు. ఇలాంటి సైబర్‌నే రాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. అలాగే ప్రజలు కూడా అత్యాశ పడి ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా లోను పెడితే మాత్రం మీ చేతులారా మీరే నష్టపోవాల్సి వస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు

రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2025 | 09:19 AM