Share News

MLA: తల్లి, చెల్లిని గెంటేసి, ఇప్పుడు మహిళలపై సానుభూతి..

ABN , Publish Date - Jun 20 , 2025 | 01:41 PM

ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్‌ తన సైకో బ్యాచ్‌తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు మండిపడ్డారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

 MLA: తల్లి, చెల్లిని గెంటేసి, ఇప్పుడు మహిళలపై సానుభూతి..

- రెచ్చగొట్టేలా జగన్‌ మాటలు

- 70 శాతం రెడ్లకు పదవులిచ్చి, కమ్మవాళ్లపై ఇప్పుడా ప్రేమ?

- మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు

అనంతపురం: ప్రస్తుతం రాష్ట్రంలో రెట్టింపు సంక్షేమం అమలవుతూ ఉంటే తట్టుకోలేని జగన్‌ తన సైకో బ్యాచ్‌తో రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు(Madakasira MLA MS Raju) మండిపడ్డారు. అనంతపురం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించేలా జగన్‌ వ్యవహరిస్తున్నాడన్నారు. 80 కిలోమీటర్లు ర్యాలీగా వెళ్లవద్దంటూ పోలీసులు చెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. సభ నిర్వహించరాదన్నా ముందుకెళ్లి ఇద్దరి చావుకు కారణమయ్యాడంటూ విమర్శించారు.


బెట్టింగ్‌లు ఆడి నాగమల్లేశ్వర్‌రావు ఏడాది కిందట మరణిస్తే.. ఇప్పుడు గుర్తుకు రావడం రాజకీయ డ్రామా అన్నారు. జగన్‌(Jagan) కోసం వచ్చిన ఇద్దరు చనిపోతే...ఒక్క నిమిషం వాళ్ల కుటుంబీకులకు మాట్లాడించలేదన్నారు. జగన్‌ ఏపీలో కమల్‌హాసన్‌ లాగా బాగా నటిస్తున్నాడని విమర్శించారు. రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు, మహిళల హత్యల్లో అప్పటి జగన్‌ప్రభుత్వం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదన్నారు. కానీ అవన్నీ మరిచి నేడు మాట్లాడుతున్నారన్నారు. తల్లి విజయమ్మను పార్టీ నుంచి, షర్మిలను ఇంటి నుంచి గెంటేసిన ఆయన, అమరావతి మహిళలపై తన మీడియాలో వేశ్యలుగా మాట్లాడించిన జగన్‌ ఇప్పుడు మహిళల గౌరవం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.


pandu1.2.jpg

గంజాయి తాగేటోళ్లు, రేపిస్టులు, భూకబ్జా కేసుల్లో ఉన్న వాళ్లను జగన్‌ పరామర్శించడానికి వెళ్లడాన్ని బట్టే జగన్‌ మనస్తత్వం ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. మీరు నరికితే నరికించుకుంటారా..? అవతలి వాళ్లకు చేతులు ఉండవా... వేట కొటవళ్లు ఉండవా అని ప్రశ్నించారు. 2029లో అధికారంలోకి వస్తే అంటూ రెచ్చగొడితే ప్రజలు అధికారం కట్టబెట్టరని, మీ మాటలకు ప్రజల దగ్గర సమాధానం ఉందంటూ సూచించారు. ఇద్దరు పిల్లలుంటే అమ్మఒడి రూ. 30 వేలు ఇస్తామని చెప్పి, అర్ధ ఒడిగా చేశారన్నారు. తన ప్రభుత్వంలో 70 శాతం పదవులు తన సామాజికవర్గం వాళ్లకు ఇచ్చి, ఇప్పుడు కమ్మ వాళ్లపై ప్రేమ చూపడం హాస్యాస్పదమన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో వందకు వంద శాతం రెట్టింపు సంక్షేమం అమలవుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు

పాడు బుద్ధి.. పోయే కాలం

Read Latest Telangana News and National News

Updated Date - Jun 20 , 2025 | 01:41 PM