Minister Atchannaidu: జగన్ ఓ చీడపురుగు
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:58 AM
జగన్ ఓ చీడపురుగు. ఆ చీడపురుగును రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.....

శ్రీకాకుళం, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘జగన్ ఓ చీడపురుగు. ఆ చీడపురుగును రాష్ట్రంలో లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళిలో బుధవారం నిర్వహించిన ‘సుపరిపాలన తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘జగన్‌రెడ్డి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి. రాష్ట్రంలో ఉండకూడదు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వైసీపీ దొంగలకు కనపడటం లేదా..? కళ్లు, చెవులు మూసుకున్నారా?’ అని ప్రశ్నించారు.