Illegal Mining: అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ముందస్తు బెయిల్
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:34 AM
అక్రమమైనింగ్‌కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలిగించి న వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముం దస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మంజూరు చేసిన హైకోర్టు... సుప్రీంకు వెళ్లనున్న సర్కార్
అమరావతి, జూన్ 28(ఆంధ్రజ్యోతి): అక్రమమైనింగ్‌కు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలిగించి న వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ముం దస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పీల్ దాఖలుకు చర్యలు తీసుకోవాలని అడ్వొకేట్ ఆన్ రికార్డ్(ఏవోఆర్) కార్యాలయ ప్రత్యేక అధికారిని ఆదేశించింది. దీనికి సంబంధించి హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజీత్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు.
వైసీపీ హయాంలో విజయవాడ రూరల్, బాపులపాడు గన్నవరం మండలాల పరిధిలో వల్లభనేని వంశీ, అతని అనుచరులు అక్రమమైనింగ్‌కు పాల్పడటంతో ఖజానాకు రూ.195 కోట్ల నష్టం కలిగిందని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌శాఖ తేల్చింది. దీనిపై జిల్లా మైనింగ్ అధికారి ఫిర్యాదు ఆధారంగా గన్నవరం పోలీసులు మే 14న కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాసిక్యూషన్ తరఫు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అక్రమమైనింగ్ 2019 నుంచి2024 వరకు జరిగిందన్నారు. సవివరంగా కౌంటర్ వేసేందుకు వారం రోజులు సమయం ఇవ్వాలని కోరారు.