Gorantla Madhav: గోరంట్లను కస్టడీకీ కోరుతూ కోర్టులో పోలీసులు పిటీషన్..
ABN , Publish Date - Apr 17 , 2025 | 01:42 PM
Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చేబ్రోలు కిరణ్ కుమార్ అనే వ్యక్తిపై గోరంట్ల మాధవ్ దాడి చేశాడు. ఈ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన ఉన్న విషయం తెలిసిందే. గురువారం నాడు గోరంట్ల మాధవ్ కేసుపై కోర్టు విచారణ చేపట్టింది.

గుంటూరు జిల్లా: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఐదు రోజుల కస్టడీ కోరుతూ నగరం పాలెం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ(గురువారం) గోరంట్ల మాధవ్ న్యాయవాదులు న్యాయస్థానంలో కౌంటర్ దాఖలు చేయనున్నారు. చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నం కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాగా, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతిపై చేబ్రోలు కిరణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. కిరణ్‌ను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కిరణ్‌పై గోరంట్ల మాధవ్ దాడి చేశాడు. దీంతో మాధవ్‌ను అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. గుంటూరులోని జీజీహెచ్‌కు వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాక కూడా గోరంట్ల మాధవ్ నానా హంగామా సృష్టించాడు. వైద్యపరీక్షల అనంతరం నల్ల పాడు పోలీసు స్టేషన్‌కు గోరంట్ల మాధవ్‌ను పోలీసులు తరలించారు. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Raj Tarun Parents: హైడ్రామాకు తెర.. ఇంట్లోకి వెళ్లిన రాజ్‌తరుణ్ పేరెంట్స్
Mithun Reddy High Court: ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్.. ఎందుకంటే
Tirupati Hostel Incident: విద్యార్థినిల గదిలోకి ప్రిన్సిపాల్.. తిరుపతిలో దారుణం
Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా
Read Latest AP News And Telugu News