Share News

Shravan Rao ON SIT Enquiry: సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేత ధోరణిలో శ్రవణ్‌రావు సమాధానాలు

ABN , Publish Date - Jul 24 , 2025 | 06:45 PM

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో గురువారం విజయవాడలోని సిట్ ఆఫీస్‌కు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్‌ కేసులో నిందితులకు దుబాయ్‌లో శ్రవణ్‌రావు ఆశ్రయం ఇచ్చాడని అధికారుల విచారణలో తేలడంతో నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన సిట్ ఆఫీసుకి వచ్చారు.

Shravan Rao ON SIT Enquiry: సిట్ అధికారుల ప్రశ్నలకు దాటవేత ధోరణిలో శ్రవణ్‌రావు సమాధానాలు
Shravan Rao ON SIT Enquiry

విజయవాడ: ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో (AP Liquor Scam Case) ఇవాళ(గురువారం జులై 24) విజయవాడలోని సిట్ ఆఫీస్‌కు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు (Telangana Phone Tapping)శ్రవణ్‌రావు (Shravan Rao) విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్‌ కేసులో నిందితులకు దుబాయ్‌లో శ్రవణ్‌రావు ఆశ్రయం ఇచ్చాడని అధికారుల విచారణలో తేలడంతో నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన సిట్ ఆఫీసుకి వచ్చారు. అయితే మూడు గంటలుగా శ్రవణ్‌రావుని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. దుబాయ్‌లో లిక్కర్ స్కామ్‌ నిందితులకు రెండు నెలల పాటు శ్రవణ్‌రావు ఫ్లాట్‌లో ఉన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులకు ఆశ్రయం ఇవ్వడంపై శ్రవణ్‌రావుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ అధికారుల విచారణలో శ్రవణ్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు.


లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితులకు దుబాయ్‌లో శ్రవణ్‌రావు ఆశ్రయం కల్పించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కిరణ్ కుమార్‌రెడ్డి, సైఫ్, అహ్మద్, వరుణ్ కుమార్, శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యుమ్నా, అవినాష్ రెడ్డి, అనిరుద్‌రెడ్డిలు ఎలా పరిచయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. ఓ స్నేహితుడి ద్వారా పరిచయమని తెలిపారు శ్రవణ్‌రావు. ఆశ్రయం ఎందుకు కల్పించారని శ్రవణ్‌రావుని ప్రశ్నించారు సిట్ అధికారులు.


అయితే ఈ విషయంలో మౌనంగా ఉండిపోయారు శ్రవణ్‌రావు. లిక్కర్ కేసులో వాళ్లు నిందితులు తెలుసా అంటూ శ్రవణ్‌రావుని నిలదీశారు. అయితే ఈ విషయం తనకు తెలియదని శ్రవణ్‌రావు బదులు ఇచ్చాడు. ఈ కేసులో కీలక నిందితులని తెలిసినా ఆశ్రయం ఇచ్చారా అంటూ మరోసారి ప్రశ్నించారు సిట్ అధికారులు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ ఆశ్రయం కల్పించారని ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్ ప్రశ్నలకు శ్రవణ్‌రావు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.


శ్రవణ్‌రావు విచారణలో ట్విస్ట్

అయితే, శ్రవణ్‌రావు సిట్ విచారణలో ట్విస్ట్ నెలకొంది. శ్రవణ్‌రావు సాక్షి మాత్రమేనా?నిందితుడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులకు దుబాయ్‌లో ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పించాడా? ఉద్దేశపూర్వకంగా కల్పిస్తే ఈ కేసులో నిందితుడిగా చేరుస్తారా? అనే సందేహాలు వస్తున్నాయి. లిక్కర్ స్కాం నిందితులకు శ్రవణ్‌రావు ఎందుకు ఆశ్రయం కల్పించారు. ఎవరి మెప్పుకోసం నిందితులకు ఆశ్రయం కల్పించారని ప్రశ్నించారు సిట్ అధికారులు.


తనకు ఏమి తెలియదు...లిక్కర్ స్కాం కేసులో నిందితులని తెలియదని సిట్ ముందు శ్రవణ్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ కేసు నుంచి శ్రవణ్‌రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? ఫైనల్‌గా సిట్ అధికారులు ఏమి నిర్ధారిస్తారు. శ్రవణ్‌రావు లిక్కర్ స్కాం కేసులో సాక్షినా?....నిందితుడా?. ఇప్పటికే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా శ్రవణ్‌రావు ఉన్న విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి నారా లోకేష్‌ను ఆలింగనం చేసుకున్న పవన్ కల్యాణ్

Hari Hara Veeramallu: సీఎం చంద్రబాబుకు హరిహర వీరమల్లు థ్యాంక్స్..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 24 , 2025 | 06:53 PM