Share News

YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్

ABN , Publish Date - Apr 22 , 2025 | 11:29 AM

YSRCP Leaders: వైసీపీ ప్రభుత్వంలో భారీ మద్యం కుంభకోణాన్ని కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకు వచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వైసీపీ నేతల అరెస్ట్‌తో ఆ పార్టీ నేతలు టెన్షన్‌కు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారోనని భయాందోళనలు చెందుతున్నారు.

 YSRCP Leaders: దూకుడు పెంచిన కూటమి సర్కార్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్
YSRCP Leaders

అమరావతి: తాడేపల్లి ప్యాలెస్‌‌ను మద్యం మూలాలు తాకుతుండటంతో జగన్ పార్టీలోని కొంతమంది నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి(కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి) అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం సిట్ విచారణలో ఆయన ఉన్నారు. ఈ రోజు సాయంత్రంలోపు కోర్టుకు రాజ్ కసిరెడ్డి వెళ్లనున్నారు. కసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్‌ను పోలీసులు తయారు చేస్తున్నారు. అలాగే ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఇంటెలిజెన్స్ మాజీ బాస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే.


ముంబై నటి కాదంబరి జత్వాని అక్రమ అరెస్ట్ కేసులో ఆంజనేయులను ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 2024 ఫిబ్రవరి రెండో తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 4వ తేదీన ఈ కేసులో జత్వానిపై గతంలో ఫిర్యాదు చేసిన కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో అప్పటి విజయవాడ సీపీ కాంతి రాణాటాటా, డీసీపీ విశాల్ గున్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పీఎస్ఆర్ ఆంజనేయులపై రిమాండ్ రిపోర్ట్‌ను సీఐడీ అధికారులు తయారు చేస్తున్నారు.


ఈ కేసులో కీలకంగా డీసీపీ విశాల్ గున్ని స్టేట్‌మెంట్ మారింది. తనను అప్పటి ఇంటెలిజెన్స్ బాస్ ఆంజనేయులు పిలిస్తేనే సీఎంఓకు వెళ్లానని విశాల్ గున్ని చెప్పారు. తనకు ఫ్లైట్ టిక్కెట్లు కూడా ఆ రోజు సీపీ కార్యాలయంల్లో కొన్నారని విశాల్ గున్ని వివరించారు. ఈ కేసులో కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలకు ఏపీ హైకోర్ట్ ముందస్తు బెయిల్ ఇచ్చింది.


ముందస్తు బెయిల్‌కు కూడా పీఎస్ఆర్ ఆంజనేయులు పిటీషన్ వేయలేదు. మాజీ ఎంపీ రఘురామపై టార్చర్ కేసులో కూడా ఆంజనేయులు నిందితుడిగా ఉన్నారు. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ కూడా నిందితుడిగా తేల్చారు. ఈ కేసులో కూడా సునీల్, ఆంజనేయులు ముందస్తు బెయిల్ తీసుకోలేదు. జత్వాని కేసులో అరెస్ట్ తర్వాత ఆంజనేయులను రిమాండ్‌కు పంపితే రఘురామ కేసులో పీటీ వారెంట్ వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

IPS officer Anjaneyulu: కాదంబరి జత్వాని కేసులో మరో ఐపీఎస్ అరెస్ట్

AP NEWS: ఎలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ

High Court: చట్టానికి లోబడే దర్యాప్తు జరగాలి

Kakani Govardhan Reddy: కాకాణికి లభించని ఊరట

PM Modi Visits to Amaravati: మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 11:59 AM