Share News

Nara Lokesh: నా ముద్దుల మావయ్య బాలయ్య... మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు

ABN , Publish Date - Jun 10 , 2025 | 09:33 AM

పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.

Nara Lokesh: నా ముద్దుల మావయ్య బాలయ్య... మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు
Minister Nara Lokesh

అమరావతి: పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు పండుగలా ఆయన జన్మదిన వేడుకలను చేసుకుంటున్నారు. కేకులు కట్ చేసి బాలకృష్ణకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రోడ్డు షోలు నిర్వహించి బాలయ్యపై అభిమానం చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు లోకేష్.


తిరుమలలో బాలయ్య జన్మదిన వేడుకలు..

తిరుమలలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద 650 టెంకాయలు కొట్టి.. 6.5 కిలోల కర్పూరాన్ని వెలిగించి టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మొక్కులు చెల్లించుకున్నారు. సామాజిక సేవలు చేస్తూ సామాన్య ప్రజలకు బాలకృష్ణ ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. బసవతారకం ట్రస్టు ద్వారా ఎందరికో వైద్య సేవలు అందిస్తున్నారని ఉద్ఘాటించారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండటంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలని స్వామి వారిని ప్రార్ధించి మొక్కులు చెల్లించుకున్నామని శ్రీధర్ వర్మ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

భద్రాద్రిలో జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు..

సంకెళ్లు వేసి.. నేలకు అదిమి..

For More AP News and Telugu News

Updated Date - Jun 10 , 2025 | 09:53 AM